Telugu Gateway
Politics

మోడీ తెలంగాణకు చేసిందేమీ లేదు

మోడీ తెలంగాణకు చేసిందేమీ లేదు
X

ప్రధాని నరేంద్రమోడీ తెలంగాణకు..దేశానికి చేసిందేమీలేదని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) లోక్ సభాపక్ష నేత జితేందర్ రెడ్డి విమర్శించారు. అన్నీ ఉత్తిమాటలే తప్ప..చేతలు ఏమీలేవన్నారు. విభజన చట్టంలో ఉన్న హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా కల్పించాలని గడ్కరీని కలిసి విజ్ఞప్తి చేశామన్నారు. తక్షణమే హైకోర్టును విభజించాలని మంత్రులకు చెప్పినట్టు తెలిపారు. తెలంగాణకు కేంద్రం ప్రత్యేకంగా నిధులు ఇవ్వలేదని పేర్కొన్నారు. సీతారామ ప్రాజెక్టు విషయంలో కేంద్రం జాప్యం చేస్తుందని మండిపడ్డారు. కేంద్రం తెలంగాణకు ప్రత్యేకంగా ఎటువంటి నిధులు ఇవ్వలేదని పేర్కొన్నారు. బీజేపీ కేవలం మాటల ప్రభుత్వం అని విమర్శించారు.

నిజామాబాద్‌ ఎంపీ కవిత మాట్లాడుతూ.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్‌ఎస్‌ పార్టీ 16 స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఓటమికి ప్రతిపక్షాలు కుంటి సాకులు వెతుకుతున్నాయని విమర్శించారు. ఎన్నికల్లో ఓటమికి తొలుత ఈవీఎంల ట్యాంపరింగ్‌ అన్నారని.. ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబును నిందిస్తున్నారని వ్యాఖ్యానించారు. జాతీయ రాజకీయాల్లో తెలంగాణ తరఫున కీలక భూమిక పోషిస్తామని తెలిపారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారని అన్నారు. అసెంబ్లీ రద్దుకు తర్వాత కూటమి ఏర్పాటయిందని గుర్తుచేశారు. కూటమి కట్టకముందే కాంగ్రెస్‌ ఓడిపోయిందని మరో ఎంపీ వినోద్ వ్యాఖ్యానించారు.

Next Story
Share it