Telugu Gateway
Cinema

చరణ్ ఫస్ట్ పాట వచ్చేసింది

చరణ్ ఫస్ట్ పాట వచ్చేసింది
X

వినయ విధేయ రామ సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్ విడుదల చేసిన తొలి సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తందానే తందానే ..చూశారా ఏ చోట అయినా ఇంతానందన్నే’ అంటూ సాగిన పాట కూల్ గా...క్లాసిక్ గా ఉంది. బోయపాటి శ్రీను ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించినట్లు కన్పిస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా కైరా అద్వానీ అదరగొట్టనుంది.

ఈ భామ తెలుగులో చేసిన తొలి సినిమా భరత్ అనే నేను సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు చరణ్ తో చేస్తున్నది రెండవ సినిమా. ఈ సినిమాలో చాలా రోజుల తర్వాత ఈవీవీ సత్యనారాయణ తనయుడు ఆర్యన్ రాజేష్ కన్పించబోతున్నారు. భారీ చిత్రాలను నిర్మించే డీవీవీ దానయ్య ఈ సినిమా నిర్మాత. ఇప్పటికే విడుదలైన టీజర్ కు విశేష ఆదరణ లభించింది. సంక్రాంతికి ఈ సినిమా బరిలో నిలవనుంది.

https://www.youtube.com/watch?v=vXlVD9pBV9s

Next Story
Share it