Telugu Gateway
Telangana

తెలంగాణలో ‘రికార్డు’ పోలింగ్

తెలంగాణలో ‘రికార్డు’ పోలింగ్
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఈ సారి ‘రికార్డ్’ పోలింగ్ ను నమోదు చేశాయి. 2014 ఎన్నికల సమయంలో తెలంగాణలో 69.5 శాతం పోలింగ్ నమోదు కాగా..ఈ సారి మాత్రం ఏకంగా 73.20 శాతం పోలింగ్ నమోదు కావటం విశేషం. ఇంత భారీ పెరుగుదల రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. శనివారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో సీఈఓ రజత్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా 73.20 శాతం పోలింగ్‌ నమోదయిందని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా పోలింగ్‌ నమోదైనట్టు చెప్పారు. ఈ ఎన్నికల్లో పురుషుల పోలింగ్‌ 72.54 శాతం కాగా.. మహిళల పోలింగ్‌ 73.88గా ఉందన్నారు. ఈ ఎన్నికల్లో పురుషుల ఓటింగ్‌ శాతం కంటే మహిళల ఓటింగ్‌ శాతం పెరిగిందన్నారు. ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలో అత్యధికంగా (85.97 శాతం) పోలింగ్‌ నమోదవగా.. చార్మినార్‌ నియోజకవర్గంలో అత్యల్పంగా (40.18 శాతం) పోలింగ్‌ నమోదయిందన్నారు.

జిల్లాల వారిగా ఓటింగ్‌ శాతం

ఆదిలాబాద్‌- 83.37

కరీంనగర్‌- 78.20

మంచిర్యాల- 78.72

పెద్దపల్లి - 80.58

కామారెడ్డి- 83.05

నిర్మల్‌ - 81.22

నిజామాబాద్‌- 76.22

జగిత్యాల- 77.89

రాజన్న సిరిసిల్ల- 80.49

సంగారెడ్డి- 81.94

మెదక్‌- 88.24

సిద్దిపేట- 84.26

రంగారెడ్డి- 61.29

వికారాబాద్‌- 76.87

మేడ్చల్‌, మల్కాజ్‌గిరి- 55.85

మహబూబ్‌నగర్‌- 79.42

నాగర్‌ కర్నూలు- 82.04

వనపర్తి- 81.65

జోగులాంబ- 82.87

నల్గొండ- 86.82

సూర్యాపేట- 86.63

యాదాద్రి భువనగిరి- 90.95

జనగామ- 87.39

మహబూబాబాద్‌- 89.68

వరంగల్‌ అర్బన్‌- 71.18

జయశంకర్‌ భూపాలపల్లి- 82.31

భద్రాద్రి కొత్తగూడెం- 82.46

ఖమ్మం- 85.99

వరంగల్‌ గ్రామీణం- 89.68

హైదరాబాద్‌- 48.89

Next Story
Share it