Telugu Gateway
Telangana

కారు జోరు

కారు జోరు
X

తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కారు జోరు కన్పిస్తోంది. తొలి రౌండ్ పూర్తయ్యే సరికి కారు ‘చాలా దూరం’ వెళ్లింది. ఈ లెక్కన టీఆర్ఎస్ గెలుపు ఖాయం అయినట్లే కన్పిస్తోంది. ఇక తేలాల్సింది తుది లెక్క మాత్రమే. మంగళవారం ఉదయం 9.30 గంటల నాటికి టీఆర్ఎస్ 81 సీట్లలో లీడ్ లో ఉండగా...కూటమి 18 సీట్లలో లీడ్ లో ఉంది. బిజెపి నాలుగు సీట్లలో, ఎంఐఎం ఆరు సీట్లలో మందంజలో ఉంది.

విశేషం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీలోని మహామహులు అందరూ వెనకబడి ఉండటం విశేషం. సాక్ష్యాత్తూ జానారెడ్డి, గీతారెడ్డి, డీ కె అరుణ, భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లు కూడా వెనకంజలో ఉన్నారు. ఈ లీడ్స్ మాత్రం కాంగ్రెస్ పార్టీని షాక్ కు గురిచేశాయని చెప్పొచ్చు.

Next Story
Share it