Telugu Gateway
Cinema

‘రెచ్చిపోదాం బ్రదర్’ అంటున్న వెంకీ..వరుణ్

‘రెచ్చిపోదాం బ్రదర్’ అంటున్న వెంకీ..వరుణ్
X

టీజర్ తో నే సినిమాపై అంచనాలు పెంచేసిన ఎఫ్2 చిత్ర యూనిట్ బుధవారం నాడు ఓ పాట టీజర్ ను విడుదల చేసింది. ఈ పాట కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. అందులో హీరోలు వెంకటేష్, వరుణ్ తేజ్ లు ‘రెచ్చిపోదాం బ్రదర్’ అంటూ హంగామా చేశారు. ఈ పాటతో పాటు...సన్నివేశాలు కూడా రిచ్ నెస్ తో ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో వెంకటేష్ కు జోడీగా తమన్నా, వరుణ్ కు జోడీగా మెహరీన్ నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మాత. జనవరి 12న సినిమాను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

అనిల్ రావిపూడి ఈ చిత్ర దర్శకుడు. ఈ సినిమాలోని మొదట పాటలోని టీజర్ ను విడుదల చేశారు. ‘క్రికెట్ ఆడే బంతికి రెస్టే దొరికినట్లు ఉందిరో..1947 ఆగస్టు 17ని నేడు చూసినట్లు ఉందిరో’ అంటూ వెంకటేష్, వరుణ్ తేజ్, రాజేంద్రప్రసాద్ లు సరదాగా డ్యాన్స్ చేస్తూ సాగుతారు ఇందులో. ఈ సినిమా పూర్తి స్థాయి ఎంటర్ టైనర్ గా ఉండటం ఖాయంగా కన్పిస్తోంది.

https://www.youtube.com/watch?time_continue=56&v=Enc13D4t-z8

Next Story
Share it