Telugu Gateway
Cinema

బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రియా వారియర్

బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రియా వారియర్
X

ఒక్క కన్ను గీటుతో దేశాన్ని ఊపేసిన అమ్మాయి ‘ప్రియా వారియర్’. ప్రియా వారియర్ పేరు చెప్పగానే ఎవరికైనా గుర్తుకొచ్చేది ఆ కన్ను గీటుడు సీనే. ఈ కుర్ర అమ్మాయి తొలి సినిమా ఇంకా విడుదల కాక ముందే ఏకంగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టేసింది ఈ అమ్మడు. ఆమె ‘శ్రీదేవి బంగ్లా’ పేరుతో తెరకెక్కిస్తున్న సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు లండన్ లో జరుగుతోంది. ప్రశాంత్ మాంబుల్లి ఈ సినిమా దర్శకుడుగా ఉన్నారు. సుమారు 70 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రభుదేవా కూడా నటిస్తున్నట్లు చెబుతున్నారు.

ఇప్పటికే పలు యాడ్స్ లో ప్రియా వారియర్ ఛాన్స్ లు దక్కించుకున్న సంగతి తెలిసిందే. మరి బాలీవుడ్ లో ఈ భామ ఎంట్రీ ఎలా ఉంటుందో వేచిచూడాల్సిందే. ఇప్పుడు యూత్ లో ప్రియాపై ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పటికే టాలీవుడ్ కు చెందిన నిర్మాతలు కూడా ప్రియా సంప్రదించినట్లు సమాచారం. అయినా ఇంత వరకూ ఏమీ ఫైనల్ కాలేదు.

Next Story
Share it