Telugu Gateway
Telangana

కొత్త రాజులు వస్తున్నారు

కొత్త రాజులు వస్తున్నారు
X

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ పాలనను రాజుల పాలనతో పోల్చారు. ప్రజాస్వామ్యం గొంతు నొక్కి కొత్త రాజులు పుట్టుకొస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ తెలంగాణ ఎన్నికల్లో ప్రధాన ఏడు పార్టీలు పోటీలో ఉన్నాయి. వంశపారంపర్య పాలనకు వ్యతిరేకంగా మీ గళాన్ని విప్పండి. కొన్ని పార్టీల్లో తండ్రి పోటీ చేస్తున్నారు.. కొడుకు పోటీ చేస్తున్నారు. ఇది అంబేడ్కర్‌ సిద్ధాంతాలకు వెన్నుపోటు పొడవడమే. ఇక్కడ పోటీచేస్తున్న పార్టీల్లో బీజేపీ ఒక్కటే ప్రజాస్వామ్యాన్ని నమ్ముతుంది అని వ్యాఖ్యానించారు. ఆయన సోమవారం నాడు హైదరరాబాద్ లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. గత ఎన్నికల ప్రచారంలో కేవలం టీఆర్ఎస్ నే టార్గెట్ చేసిన మోడీ...ఈ సారి తెలుగుదేశం పార్టీపై విమర్శలు గుప్పించారు. తెలుగువారి ఆత్మాభిమానం నుంచి టీడీపీ పుట్టింది. కాంగ్రెస్‌పార్టీ అవమానాలు సహించలేక దివంగత నేత ఎన్టీఆర్‌ టీడీపీని ఏర్పాటు చేశారు. కానీ చంద్రబాబు తన స్వార్థం కోసం కాంగ్రెస్‌తో జతకట్టారు. టీడీపీ కూడా కుటుంబ పార్టీయే, నిర్ణయాలన్నీ ఒక కుటుంబమే తీసుకుంటుంది. టీడీపీ ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరం అని ధ్వజమెత్తారు మోడీ. టీడీపీ ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు.

హైదరాబాద్‌ వస్తే తనకు సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ గుర్తుకొస్తారని తెలిపారు. పటేల్‌ వల్లే హైదరాబాద్‌కు విముక్తి లభించిందన్నారు. బీజేపీ తరుఫున పోటీ చేసే అభ్యర్థులను పరిచయం చేసిన ఆయన ‘ఈ ఎన్నికలు బీజేపీ ఎన్నికలనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలా? వద్దా అని తేల్చుకునే సమయమిది. వంశపారంపర్యం రాజకీయాలు పెరుగుతున్నాయి. అలాంటి వారికి సవాల్‌ విసిరి తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలవాలి.

మజ్లిస్‌ కూడా కుటుంబ పార్టీయే. కాంగ్రెస్‌పార్టీలో ప్రజాస్వామ్యం మిగిలి ఉందా? 125 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ ఇప్పుడు ఒక కుటుంబానికి పరిమితమైంది. తెలంగాణ ఉజ్వల భవిష్యత్‌ కోసం ఇక్కడి యువత బలిదానాలు చేసింది. టీఆర్‌ఎస్‌ కూడా కుటుంబ పార్టే.. ఒక కుటుంబం కోసమే యువత ఆత్మబలిదానాలు చేసుకున్నారు? ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంటే ఈ కుటుంబ రాజకీయాలకు ముగింపు పలకండి అని పిలుపునిచ్చారు.

Next Story
Share it