Telugu Gateway
Cinema

‘మిస్టర్ మజ్ను’ టైటిల్ సాంగ్ వచ్చేసింది

‘మిస్టర్ మజ్ను’ టైటిల్ సాంగ్ వచ్చేసింది
X

అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా మిస్టర్ మజ్ను. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ సాంగ్ ను చిత్ర యూనిట్ మంగళవారం నాడు విడుదల చేసింది. ఇందులో అఖిల్ సిక్స్ ప్యాక్ లో విదేశీ అమ్మాయిలతో ఆడిపాడుతూ కన్పిస్తాడు. ‘దేవదాసు మనవడు..మన్మథుడికి వారసుడు. కావ్యంలో కాముడు..అంతకన్నా రసికుడు’ అంటూ సాగే పాట పిక్చరైజేషన్ రిచ్ గా ఉంది. ఈ సినిమాకు వెంకీ అట్లూరీ దర్శకత్వం వహిస్తుండగా..ఈ సినిమాలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తోంది. ఈ సినిమా జనవరి 25న విడుదల కానుంది. వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

https://www.youtube.com/watch?v=P4a0BRbkyyA

Next Story
Share it