Telugu Gateway
Cinema

జనవరి 25న ‘మిస్టర్ మజ్ను’

జనవరి 25న ‘మిస్టర్ మజ్ను’
X

అక్కినేని అఖిల్ తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోవటానికి రెడీ అవుతున్నాడు. జనవరి 25న ఈ యువ హీరో కొత్త సినిమా ‘మిస్టర్ మజ్ను’ విడుదల కానుంది. ఇప్పటికే ఈ హీరో చేసిన రెండు సినిమాలు అఖిల్, హాలో లు యావరేజ్ టాక్ తోనే సాగాయి. సరైన హిట్ కోసం ఈ అక్కినేని హీరో అష్టకష్టాలు పడుతున్నాడు. నటనలో ఈజ్ ఉన్నా...డ్యాన్స్ లతో పాటు అన్ని విభాగాల్లో మంచి పనితీరు చూపించే సత్తా ఉన్నా సరైన హిట్ మాత్రం ఆయన ఖాతాలో పడటం లేదు. మరి ‘మిస్టర్ మజ్ను’ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో వేచిచూడాల్సిందే. ఈ సినిమాలో అఖిల్ కు జోడీగా నిధి అగర్వాల్ నటించారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అయింది. ఒక్క పాట మాత్రమే మిగిలి ఉంది.

Next Story
Share it