Telugu Gateway
Telangana

ఎంఐఎం కొత్త ట్విస్ట్

ఎంఐఎం కొత్త ట్విస్ట్
X

తెలంగాణ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్), ఎంఐఎం ఈ ఎన్నికల్లో మిత్రపక్షాలుగా కొనసాగాయి. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ పలు బహిరంగ సభల్లో బహిరంగంగానే టీఆర్ఎస్ కు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఇప్పుడు ఎక్కడలేని ఉత్కంఠ నెలకొని ఉంది. ఒక వేళ హంగ్ వస్తే తాము టీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వటానికి రెడీ అని..అయితే టీఆర్ఎస్ ఎంఐఎంకు దూరం ఉండాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. అయితే టీఆర్ఎస్ నేతలు మాత్రం దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.

అయితే కాంగ్రెస్ మాత్రం ..ఇదుగో..బిజెపి,టీఆర్ఎస్ ఒప్పందం అంటూ ఎంఐఎంను తమతో కలవాలని ఆహ్వానించారు. అయితే కాంగ్రెస్ ఆహ్వానంపై ఇప్పుడే స్పందించలేనన్నారు అసద్. తుది ఫలితాలు వెల్లడయ్యే వరకు వేచి ఉండాలన్నారు. ఎగ్జిట్‌ పోల్స్‌ అన్నీ టీఆర్‌ఎస్‌కే పట్టం కట్టినా.. మరోవైపు హంగ్‌ వస్తుందనే ప్రచారం ఊపందుకుంది. ఎంఐఎం మాత్రం ఫలితాలను బట్టి అనుసరించాలని నిర్ణయించుకున్నట్లు ఒవైసీ తాజా వ్యాఖ్యలను బట్టి అర్థం చేసుకోవచ్చు.

Next Story
Share it