Telugu Gateway
Cinema

ప్రపంచ సంపన్నుల్లో మహేష్ బాబు!

ప్రపంచ సంపన్నుల్లో మహేష్ బాబు!
X

నిజంగా అనుకునేరు?. కేవలం ఇది సినిమాలో మాత్రమే సుమా. ప్రపంచంలోని అత్యధిక సంపన్నుల్లో ఈ సూపర్ స్టార్ ఐదవ స్థానంలో ఉంటారట. అంతేకాదు..ఓ కంపెనీ సీఈవోగా ఉండే ఆయన సంపద ఆ రేంజ్ లో ఉంటుంది మరి. ఇదంతా మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘మహర్షి’లో అని టాలీవుడ్ టాక్. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటోంది.

ఈ సినిమాకు ఓ ప్రత్యేకత కూడా ఉంది. ఇది సూపర్ స్టార్ 25వ సినిమా. మహేష్ బాబు సరసన ఈ సినిమాలో పూజా హెగ్డె నటిస్తున్నారు. కామెడీ హీరో అల్లరి నరేష్ కూడా ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో కన్పించబోతున్నారు. ఈ సినిమా 2019 ఏప్రిల్ లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. అంటే మహేష్ బాబు వేసవి బరిలో నిలవనున్నాడన్న మాట.

Next Story
Share it