Telugu Gateway
Telangana

సంచలన విషయాలు బహిర్గతం చేసిన లగడపాటి

సంచలన విషయాలు బహిర్గతం చేసిన లగడపాటి
X

65 మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని చెప్పా

కెటీఆరే నన్ను కలిశారు..సర్వే చేయన్నారు

రూపాయి తీసుకోకుండా చేసిపెట్టా

చేదు నిజాలు నచ్చలేదు..తీపి కబురుసరిపోలేదు

నేను తెలంగాణ వ్యతిరేకిని అయితే కెటీఆర్ కోరిక ఎందుకు మన్నిస్తా

రాజకీయ అరెస్టులు వద్దని చెప్పా

మేం గెలుపు కోసమే వచ్చామంటే కుదరదు

వరంగల్ లో కూడా ఇప్పుడుకాంగ్రెస్ దే హవా

ఎస్సీ..ఎస్టీ నియోజకవర్గాల్ల్ వార్ వన్ సైడ్ ఉంది

తెలంగాణ రాజకీయాలకు సంబంధించి లగడపాటి రాజగోపాల్ పెద్ద బ్లో అవుట్ రాజేశారు. మంత్రి కెటీఆర్ చేసిన ట్వీట్ కు సమాధానంగా ఆయన బుధవారం నాడు మరోసారి మీడియా ముందుకు వచ్చారు. అందులో ఎన్నో సంచలన విషయాలు బహిర్గతం చేశారు. తాజా సమాచారం ప్రకారం వరంగల్ జిల్లాలోనూ కాంగ్రెస్ పార్టీనే లీడ్ లో ఉందని...వరంగల్ నగరంలోనూ అదే పరిస్థితి ఉందని తేల్చిచెప్పారు. నిజామాబాద్ కు బుధవారం ఉదమయే మరో టీమ్ వెళ్ళిందని..సాయంత్రానికి ఆ నివేదిక కూడా వస్తుందని తెలిపారు. సెప్టెంబర్ 15, 16 తేదీల్లో మంత్రి కెటీఆర్ తనను కలిశారని చెప్పారు. తనను కలవాలని కోరితే...తమ బంధువు ఇంట్లో ఈ సమావేశం జరిగిందని వెల్లడించారు. ఆ సమయంలో కెటీఆర్ 37 సెగ్మెంట్లలో సర్వే చేయాలని కోరారు. ఆయన కోరిక మేరకు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా సర్వే వివరాలు ఆయనకు మెయిల్ చేశారని తెలిపారు. అందులో ఎక్కువ శాతం కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నాయని వెల్లడించారు. అయితే ఈ సర్వే కెటీఆర్ కు ఏ మాత్రం నచ్చలేదని...క్షేత్రస్థాయిలో వేరే పరిస్థితి ఉందని తనకు మెసేజ్ పెట్టారని తెలిపారు.

అయితే నిజాలు చెపితే ఆయనకు నచ్చటంలేదని వదిలేశానని వెల్లడించారు. కొంత మంది చెబుతున్నట్లు తాను తెలంగాణకు వ్యతిరేకిన అయితే కెటీఆర్ కు సర్వే ఎందుకు చేసిపెడతానని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు కలుస్తామంటున్నాడుగా..ఆయనకు ఓ పది సీట్లు ఇస్తే సరిపోతుంది కదా? అని చెప్పారు. కుదరదు..పెద్దాయన (కెసీఆర్) ఒప్పుకోడు అని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్, టీడీపీ లు కలిస్తే వార్ వన్ సైడ్ అవుతుందని చెప్పానన్నారు. లగడపాటి విలేకరుల సమావేశంలో ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... ‘ఎన్నికల్లో అభ్యర్ధులుగా మనం ఎవరినైనా పెట్టొచ్చు అనుకుంటే ప్రమాదం అని స్పష్టంగా చెప్పా. టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉందని అప్పుడు మా టీమ్ చెప్పింది. నేనెవరి ఒత్తిడితోనే సర్వే వివరాలు మార్చలేదు. తొలి సర్వే టీడీపీ, కాంగ్రెస్, టీజెఎస్, సీపీఐ విడివిడిగా పోటీచేసినప్పుడు చేసిన సర్వేలు. నాకు పదవులు ముఖ్యం కాదు. వీలుంటే టీఆర్ఎస్ అభ్యర్ధులను మార్చాలని చెప్పా.. వాళ్లందరూ కలసి పోటీచేస్తే పోటీపోటా ఉంటుందని చెప్పా. 65 శాతం మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది. కూటమికి సంబంధించి సీట్ల పంపకంపై...ప్రజల్లో ఒక అపోహ వచ్చింది. తర్వాత పరిస్థితి మారింది.

నవంబర్ 20 నుంచి అనేక రిపోర్టులు వచ్చాయి. కానీ ఏ రిపోర్ట్ షేర్ చేసుకోలేదు. ఏ పార్టీ కి అనుకూలంగా వ్యతిరేకంగా చెప్పలేదు. 8 నుంచి 10 మంది ఇండిపెండెంట్లు గెలుస్తారని తొలుత చెప్పాను. సెప్టెంబర్ 16 నుంచి వేగవంతంగా పరిస్థితి మారుతుంది. పోటాపోటీ లేనప్పుడు వ్యతిరేకత కనపడదు. పోటాపోటీ వచ్చినప్పుడు ప్రభుత్వ వ్యతిరేకతతోపాటు క్యాండిడేట్ పై వ్యతిరేకత కూడా యాడ్ అవుతుంది. ఎస్సీ బెల్ట్ మొత్తం వన్ సైడెడ్ గా వెళుతుంది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇస్తామన్నారు. ఇవ్వలేదు. ఎస్సీ ముఖ్యమంత్రిని చేస్తామన్నారు. చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ఇంటికి రెండు పెన్షన్లు ఇస్తానంది. అది పనిచేస్తుంది. అండర్ కరంట్ కన్పించింది కాంగ్రెస్ వైపు. మైనారిటీలు వేగంగా మారుతున్నారు. ఎస్టీలు రిజర్వేషన్ల విషయంలో అసంతృప్తితో ఉనన్నారు. నేను ఒకరికి లొంగి చెప్పిన వ్యక్తిని కాదు. నాకు చేయి చాచే అలవాటు లేదు. రాజకీయాల్లోకి వచ్చినప్పుడే గెలుపునకు..ఓటమికి సిద్ధపడి ఉండాలి. మేం వచ్చిందే గెలుపు కోసమే అంటే కుదరదు. అహంభావంతో..అహంకారంతో వెళ్ళకండి అని నిక్కచ్చిగా చెప్పా. ’ అని తెలిపారు. కెటీఆర్ కు పంపిన మెయిల్ తోపాటు...వాట్సప్ వివరాలను కూడా మీడియాతో షేర్ చేసుకున్నారు రాజగోపాల్. అవసరం లేక పోయినా తాను చెప్పిన ఇండిపెండెంట్ల వ్యవహారంపై ఎందుకు స్పందించారో అర్థం కాలేదని లగడపాటి వ్యాఖ్యానించారు. గజ్వేల్ లో కెసీఆర్ ఓడిపోతాడని పోలీసు కానిస్టేబుళ్ళు తనకు చెప్పారని ఆయన వ్యాఖ్యానించి కొత్త వివాదాానికి తెరలేపారు.

Next Story
Share it