Telugu Gateway
Telangana

ఎంపీల విషయంలోనూ కెసీఆర్ ది అదే మోడల్

ఎంపీల విషయంలోనూ కెసీఆర్ ది అదే మోడల్
X

తెలంగాణ అసెంబ్లీ ముందస్తు ఎన్నికల్లో సిట్టింగ్ సభ్యులందరికి సీట్లు ఇఛ్చి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కెసీఆర్ సంచలనం సృష్టించారు. ఒకే దఫా 105 మందికి సీట్లు ప్రకటించటంతో పార్టీలో కూడా కలకలం రేగింది. ఈ నిర్ణయం ఏ మాత్రం సరికాదని చాలా మంది వాదించారు. కానీ ఫలితాలు వెల్లడి తర్వాత కెసీఆర్ నిర్ణయమే కరెక్ట్ అని తేలింది. దీంతో ఇప్పుడు ఎంపీల విషయంలోనూ కెసీఆర్ అదే మోడల్ ఫాలో కానున్నారు. సిట్టింగ్ ఎంపీలు అందరికీ టిక్కెట్లు ఇవ్వనున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. ఎంపీలుగా ఉండి..ఎమ్మెల్యేలుగా గెలిచిన మల్లారెడ్డి, బాల్క సుమన్ ల ప్లేస్ లో నే కొత్త వారు రానున్నారు.

వచ్చే ఎన్నికల్లో 16 ఎంపీ సీట్లు దక్కించుకోవటానికి కృషి చేయాలని కెసీఆర్ పార్టీ ఎంపీలకు సూచించారు. తెలంగాణలో మొత్తం 17 ఎంపీ సీట్లు ఉండగా..అందులో హైదరాబాద్ సీటును ఎంఐఎంకు మినహాయించేసి..మిగిలిన చోట్ల గులాబీ జెండా ఎగరేయాలనేది కెసీఆర్ ప్లాన్. తాజాగా వచ్చిన అసెంబ్లీ ఫలితాల ప్రకారం చూస్తే మెజారిటీ సీట్లను టీఆర్ఎస్ దక్కించుకోవటానికే ఛాన్స్ లు ఉన్నాయనే అంచనాలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని రీతిలో ఓటమి చవిచూసిన కాంగ్రెస్ తన శక్తియుక్తులు అన్నీ కూడగట్టుకుని లోక్ సభ ఎన్నికల్లో ఏ మేరకు పోటీ ఇస్తుందో వేచిచూడాల్సిందే.

Next Story
Share it