Telugu Gateway
Telangana

ఏమి అరుస్తారురా..బేవకూఫ్ గాళ్లా!

ఏమి అరుస్తారురా..బేవకూఫ్ గాళ్లా!
X

ఎన్నికల ప్రచార సభలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కెసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇవి. అలంపూర్ సభలో కెసీఆర్ మాట్లాడుతుండగా..కొంత మంది కార్యకర్తలు కేకలు వేశారు. పలుమార్లు ఇలా చేశారు. దీంతో కోపానికి వచ్చిన కెసీఆర్ ఇలా గొడవ చేస్తే ప్రసంగం చేయకుండా మధ్యలోనే వెళ్ళిపోతానని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యల తర్వాత కొద్దిసేపు మౌనంగా ఉన్న కార్యకర్తలు తర్వాత మరోసారి కేకలు వేశారు. దీంతో కెసీఆర్ తీవ్ర ఆగ్రహంతో కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమి అరుస్తారురా? బేవగూఫ్ గాళ్లా?. నేను చెప్పేది ప్రజల మైండ్ లోకి పోవద్దా? అంటూ కార్యకర్తలపై మండిపడటం కలలకం రేపింది. ఈ సభలో కెసీఆర్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసీఆర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..తుంగ భద్ర జలాల్లో మన హక్కు కోసం పోరాడాం. కాంగ్రెస్, టీడీపీ మంచినీళ్లు, సాగునీరు ఇయ్యకుండా తెలంగాణను ఎండబెట్టారు. ఆర్డీఎస్‌ను ధ్వంసం చేశారు. ప్రాజెక్టును పేల్చేస్తా అన్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిపై చంద్రబాబు కేసు పెట్టడని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ మొఖం పెట్టుకొని కాంగ్రెస్, టీడీపీ ఓట్లు అడుగుతున్నయని కేసీఆర్ మండిపడ్డారు. ఆర్డీఎస్, తుమ్మిళ్ల పూర్తి స్థాయిలో రావాలి.

ఆర్డీఎస్ కింద మనకు అలాంట్‌మెంట్ ఉన్న నీటిహక్కు 15.09 టీఎంసీలు. లక్షా 20 వేల ఎకరాలు పారాలి. ఇప్పటిదాకా ఆర్డీఎస్ కాలువ కింద సీడబ్ల్యూసీ లెక్కల ప్రకారం పాత ఆయకట్టు 87,500 ఎకరాలు. ఆర్డీఎస్ ద్వారా ఇంకో 50వేల ఎకరాలకు నీళ్లిచ్చే బాధ్యత నాదని సీఎం స్పష్టం చేశారు. పాత ఆర్డీఎస్ పునరుద్దరణ కాదు..మనం ఎక్కువ తీసుకోం. మనకు అలాట్‌మెంట్ ఎంత ఉందో అంతే తీసుకుంటం. మిగులు జలాల్లో కూడా మనకు హక్కు ఉంది. అది కూడా మనం తీసుకుంటమని సీఎం స్పష్టం చేశారు. ఆర్డీఎస్ కాలువను నాశనం చేసిన దుర్మార్గులకు బుద్ది చెప్పాలంటే అబ్రహాంను భారీ మెజార్టీతో గెలిపించాలని సీఎం కేసీఆర్ కోరారు. హక్కుల కోసం పోరాడే ఒకే ఒక్క పార్టీ టీఆర్‌ఎస్ పార్టీ, ఆర్డీఎస్‌ను తీసుకుని లక్షా 20 వేల ఎకరాలకు నీళ్లిచ్చే బాధ్యత నాది. అలంపూర్ జిల్లా బార్డర్‌లో ఉంది. కర్నూలుకు వెళ్లే అవసరం లేకుండా.. గెలిచిన తర్వాత నెల లోపల అలంపూర్‌ను ఆస్పత్రిని 100 పడకలు చేస్తా. డిగ్రీ కాలేజీలు, ఫైర్ స్టేషన్ కావాలన్నరు. మూడు, నాలుగు నెలల్లో ఏర్పాటు చేస్తా. వాల్మీకి సోదరుల సమస్యలు, గిరిజనుల రిజర్వేషన్లు రానున్న రోజుల్లో సాధించుకుంటమని సీఎం స్పష్టం చేశారు.

Next Story
Share it