Telugu Gateway
Telangana

రైతు దినోత్సవాన్ని విస్మరించిన కెసీఆర్..చంద్రబాబు

రైతు దినోత్సవాన్ని విస్మరించిన కెసీఆర్..చంద్రబాబు
X

రైతు. ఈ పేరు ఎత్తితే చాలు ఎన్నికలప్పుడు పార్టీలు పులకరిస్తాయి. అసలు దేశంలోనే.. కాదు..కాదు ప్రపంచంలోనే తమను మించిన రైతు బాంధవులు ఎవరూ లేరని డప్పు కొట్టుకుంటారు. కానీ రైతు దినోత్సవాన్ని మాత్రం తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడులు పూర్తిగా విస్మరించారు. కనీసం రైతు దినోత్సవం సందర్భంగా రైతులకు శుభాకాంక్షలు చెప్పిన దాఖలాలు కూడా లేవు. అవసరం అయిన వాటికి..కాని వాటికి పత్రికల నిండా పేజీలకు పేజీల కలర్ యాడ్స్ ఇఛ్చే ముఖ్యమంత్రులు...రైతు దినోత్సవం రోజు మాత్రం కనీసం ప్రకటన విడుదల చేయటాన్ని కూడా విస్మరించారు. భారత్ లో ప్రతి ఏటా డిసెంబర్ 23ను రైతు దినోత్సవంగా నిర్వహిస్తారు. భారత దేశ ఐదవ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ దినోత్సవం నిర్వహిస్తారు. రైతుల బాగు కోసం ఎన్నో విధానాల రూపకల్పన చేయటంతోపాటు..వారి జీవితాల్లో మార్పు తెచ్చేందుకు కృషి చేసిన చౌదరి చరణ్ సింగ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించటం ఆనవాయితీ. తెలంగాణలో రైతు బంధు, రైతు భీమా వంటి పథకాల ప్రవేశపెట్టడం ద్వారా దేశంలో రైతుల కోసం తాను చేసినంతగా ఎవరూ చేయలేదని..దేశానికి తెలంగాణ రోల్ మోడల్ గా నిలుస్తుందని పదే పదే ప్రకటించారు.

రైతు భీమా, రైతు బంధు పథకాల వివరాలతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు..పొరుగు రాష్ట్రాల పత్రికల్లో కూడా కోట్లకు కోట్టు పెట్టి ప్రకటనలు ఇఛ్చారు కెసీఆర్. కానీ రైతు దినోత్సవం రోజున తెలంగాణ సీఎం కనీసం రైతులకు శుభాకాంక్షలు చెబుతూ ఓ ప్రకటన కూడా విడుదల చేసిన దాఖలాలు లేవు. ఏపీలోనూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిది అదే తీరు. తనకు ఉపయోగపడుతుందని అనుకుంటే ప్రతిదానికి ‘ఈవెంట్’ నిర్వహించే చంద్రబాబు రైతు దినోత్సవాన్ని మాత్రం చాలా కన్వీనెంట్ గా మర్చిపోయారు. ముఖ్యమంత్రులే కాదు...రెండు రాష్ట్రాల్లోనూ ప్రతిపక్ష నాయకులు కూడా రైతు దినోత్సవాన్ని పూర్తిగా విస్మరించారు.

Next Story
Share it