Telugu Gateway
Cinema

చరణ్ సినిమాలో కొత్త భామ

చరణ్ సినిమాలో కొత్త భామ
X

బోయటిపాటి శ్రీను సినిమాలు అంటే ఐటెం సాంగ్ తప్పనిసరి. ప్రతి పెద్ద హీరో సినిమాలోనూ ఇదే ఆనవాయితీగా సాగుతోంది. సినిమాకు కిక్కు ఇఛ్చేందుకు దర్శకులు..నిర్మాతలు ఈ మోడల్ ను ఫాలో అవుతున్నారు. కొన్నిసార్లు సినిమా కంటే ఐటెం సాంగ్ కు వచ్చే క్రేజ్ ఎక్కువగా ఉంటోంది. అందుకే అది ఓ పార్ములాగా మారిపోయింది. అంతే కాదు. పెద్ద పెద్ద హీరోయిన్లు కూడా ఐటెం సాంగ్స్ లో చేయటానికి ఏ మాత్రం వెనకాడటం లేదు.

ఇప్పుడు మరోసారి రామ్ చరణ్, బోయపాటి శ్రీనుల వంతు వచ్చింది. రామ్ చరణ్ గత సినిమా రంగస్థలంలోనూ ఇదే ట్రెండ్ కొనసాగించారు. ఇప్పుడు వినయ విధేయ రామ లోనూ ఈ ఫార్ములాను ఎంచుకున్నారు. ఈ పాట కోసం ఓ బాలీవుడ్ హాట్‌ బ్యూటీని సెలెక్ట్ చేసినట్టుగా సమాచారం. ఆమే ఈషా గుప్తా. ఆమె వినయ విధేయ రామలో చరణ్ సరసన హంగామా చేయనుంది.

Next Story
Share it