Telugu Gateway
Politics

రేవంత్ రెడ్డి అరెస్టు...ఎస్పీపై వేటు

రేవంత్ రెడ్డి అరెస్టు...ఎస్పీపై వేటు
X

కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అరెస్ట్ వ్య‌వహారం కొత్త మ‌లుపు తిరిగింది. రేవంత్ అరెస్టు కు కార‌ణం అయిన ఎస్పీ అన్న‌పూర్ణపై కేంద్ర ఎన్నిక‌ల సంఘం వేటు వేసింది. వెంట‌నే ఈ ఆదేశాలు అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని పేర్కొన్నారు. వికారాబాద్ నూత‌న ఎస్సీగా 2005 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి అవినాశ్‌ మహంతిని నియమించింది. అన్న‌పూర్ణ‌ను పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌కు అటాచ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల విధుల్లో అన్నపూర్ణను తీసుకోకూడదని ఈసీ ఆదేశించింది. కొడంగల్‌లోని రేవంత్‌ నివాసంలో మంగళవారం వేకువజామన పోలీసులు చొరబడి అరెస్ట్‌ చేయడంపై కాంగ్రెస్‌ నేతలు కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్య‌వ‌హారం తెలంగాణ‌లో పెద్ద రాజ‌కీయ దుమారం రేగింది. హైకోర్టు కూడా ఈ విష‌యంలో జోక్యం చేసుకుని అస‌లు తెలంగాణ‌లో ప్ర‌భుత్వం ఉందా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ త‌రుణంలో ఎస్పీపై వేటుప‌డింది.

Next Story
Share it