Telugu Gateway
Andhra Pradesh

కెసీఆర్ కు బాలకృష్ణ సవాల్

కెసీఆర్ కు బాలకృష్ణ సవాల్
X

టీఆర్ఎస్ అధినేత కెసీఆర్ కు ఎమ్మెల్యే బాలకృష్ణ సవాల్ విసిరారు. ఏపీకి వస్తామంటున్నారుగా రండి..చూసుకుందాం అని ఛాలెంజ్ చేశారు. తెలంగాణ రాజకీయాల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వేలు పెట్టారని..తాము కూడా ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకుని చంద్రబాబు అంతుచూస్తామంటూ మంత్రి కెటీఆర్ చేసిన వ్యాఖ్యలపై నందమూరి బాలకృష్ణ స్పందించారు. సోమవారం గడ్డి అన్నారంలో ప్రచారం నిర్వహించిన బాలకృష్ణ టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను ఉద్దేశించి డైలాగులు పేల్చారు. కెసీఆర్‌ది లాటరీ అని.. చంద్రబాబుది హిస్టరీ అని బాలయ్య సినిమా డైలాగులు చెప్పారు.

తెలంగాణ ప్రజలు పోరాడి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నారని అన్నారు. రైతుల కష్టాలు తీర్చే ప్రభుత్వం వస్తుందనుకుంటే రాబంధుల ప్రభుత్వం వచ్చిందని విమర్శించారు. రైతు ఆత్మహత్యల విషయంలో తెలంగాణ దేశంలోనే రెండవ స్థానంలో నిలిచిందని తెలిపారు. తెలంగాణ ప్రజలు తరిమికొడితే ఆంధ్రాకే కాదు....ఎక్కడికైనా తరలిపోవాల్సిందే అన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు చరిత్రను ఎవరూ చెరిపేయలేరన్నారు.

Next Story
Share it