Telugu Gateway
Offbeat

‘ఫ్యూచర్ హోటల్ ’ ప్రత్యేకతలేంటో తెలుసా?

‘ఫ్యూచర్ హోటల్ ’ ప్రత్యేకతలేంటో తెలుసా?
X

ఫ్యూచర్ హోటల్. ఈ హోటల్ ప్రత్యేకతలు ఏంటో తెలుసా?. కీ అవసరం లేకుండానే ‘ముఖ గుర్తింపు’తో మీ రూం తలుపులు తెరుచుకుంటాయి. ఆ మేరకు రూం గదులకు ముఖాన్ని గుర్తించే స్కానింగ్ సౌకర్యం ఉంటుంది. అంతే కాదు ఈ ఫ్యూచర్ హోటల్ గదిలో లైట్లతో పాటు టెలివిజన్, కర్టెన్ల లైటింగ్ ను కూడా వాయిస్ తో యాక్టివేట్ చేసే డిజిటల్ అసిస్టెంట్ సేవల ద్వారా నియంత్రించవచ్చు. కూర్చున్న చోట నుంచే ఈ పనులు అన్నీ చేయోచ్చు. అంతే కాదు..ఈ హోటల్ లో అవసరమైన ఆహార పదార్ధాలతోపాటు కాఫీ, కాక్ టైయిల్స్ అన్నీ సరఫరా చేసేందుకు రోబో సేవలు ఉపయోగిస్తున్నారు.

మొబైల్ యాప్ లో ఆర్డర్ చేసి ఈ సేవలు పొందవచ్చు. ‘ఫ్లై జూ’ పేరుతో ఉన్న ఈ హోటల్ ను ఏర్పాటు చేసింది ఎవరో తెలుసా?. చైనాకు చెందిన ఇంటర్నెట్ దిగ్గజ సంస్థ ‘అలీబాబా’. చైనాలోని హంగ్జూ ప్రాంతంలో ఈ హోటల్ ఏర్పాటైంది. ఈ హోటల్ బుకింగ్స్..చెక్ ఔట్ కూడా యాప్ ద్వారానే చేసుకోవచ్చు. ఇతర హోటళ్ళ తరహాలో చెక్ ఔట్ చెప్పి బిల్లు వచ్చే వరకూ వేచిచూడటం వంటి సమస్యలు ఈ ఫ్యూచర్ హోటల్ లో ఉండవు.

Next Story
Share it