Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

హీరోల దీపావళి కానుకలు

0

పండగ వచ్చింది అంటే చాలు సినీ అభిమానులకు కూడా పండగే. హీరోలు తమ చిత్రాలకు సంబంధించి ఏదో ఒక కొత్త విషయాన్ని పండగ సందర్భంగా విడుదల చేయటం ఆనవాయితీ. ప్రతి సినిమాకు ఇదే ఉంటంది. ఇప్పటికే రామ్ చరణ్ సినిమా సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయగా..మరో ఇద్దరు హీరోలు తమ అభిమానులను ఆలరించే ప్రయత్నం చేశారు. అందులో ఒకరు వరుణ్ తేజ్ అయితే..మకొరరు అక్కినేని అఖిల్. వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న అంతరిక్షం సినిమా ఈ ఏడాది డిసెంబర్ 21న విడుదల కానుంది.

- Advertisement -

దీపావళి శుభాకాంక్షల పోస్టర్ లో ఇదే విషయాన్ని వెల్లడించారు. ఈ సినిమాను ఘాజీ చిత్రంతో సంచలనం సృష్టించిన దర్శకుడు సంకల్ప్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. ఇందులో వరుణ్ కు జోడీ లావణ్య త్రిపాఠి, అదితి రావు హైదరీ నటిస్తున్నారు.  అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న సినిమా మజ్ను వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.  విషయాన్ని దీపావళి పోస్టర్ ద్వారా చెప్పారు. ఇది అఖిల్ మూడవ సినిమా.

 

 

Leave A Reply

Your email address will not be published.