Telugu Gateway
Telangana

వీసా ఫీజు లేకుండా బ్యాంకాక్ వెళ్లొచ్చు

వీసా ఫీజు లేకుండా బ్యాంకాక్ వెళ్లొచ్చు
X

భారత పర్యాటకులకు శుభవార్త. థాయ్ లాండ్ భారత్ తోపాటు మొత్తం 20 దేశాల ప్రయాణికులకు తాత్కాలికంగా వీసా ఆన్ అరైవల్ ఫీజును ఎత్తేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు థాయ్ ల్యాండ్ కేబినెట్ నిర్ణయం వెలువరించింది. అయితే ఇది కేవలం ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి జనవరి 31 వరకే అమల్లో ఉండనుంది. ప్రతి ఏటా భారత్ నుంచి లక్షలాది మంది పర్యాటకులు బ్యాంకాక్ కు వెళ్లే సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీసా ఆన్ అరైవల్ ఫీజు 2000 బాత్ లు ఉంది. అంటే భారతీయ కరెన్సీలో ఇది సుమారు 4400 రూపాయలు. పర్యాటకుల సంఖ్యను పెంచుకొనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

వీసా ఫీజు తొలగింపు నిర్ణయం వల్ల థాయ్ ల్యాండ్ పర్యాటకం 30 శాతం మేర పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఏటా పెద్ద ఎత్తున పర్యాటకులు వెళ్ళే దేశాల్లో థాయ్ లాండ్ కూడా ఉంటుంది. భారత్ నుంచి కూడా పెద్ద ఎత్తున బ్యాంకాక్ కు పర్యాటకులు వెళతారు. కొద్ది రోజుల క్రితం వరకూ వెయ్యి బాత్ లే ఉన్న వీసా ఫీజును కొద్ది రోజుల క్రితం థాయ్ లాండ్ ఏకంగా రెండు వేల బాత్ లకు పెంచింది. ఇప్పుడు పర్యాటకులను ఆకట్టుకునేందుకు తాత్కాలిక వీసా ఫీజు తొలగింపు నిర్ణయం తీసుకుంది.

Next Story
Share it