Telugu Gateway
Politics

కాంగ్రెస్ అభ్యర్ధుల జాబితా నవంబర్ 8న

కాంగ్రెస్ అభ్యర్ధుల జాబితా నవంబర్ 8న
X

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్ధుల జాబితాను ప్రకటించటం వెనక వ్యూహాత్మక జాప్యం చేస్తుందా? అంటే అవుననే చెబతున్నాయి ఆ పార్టీ వర్గాలు. ఎంత తొందరగా జాబితా వెల్లడైతే అభ్యర్ధుల ఖర్చు అంత పెరుగుతుందని..అందుకే తాము కావాలనే జాప్యం చేస్తున్నట్లు మహాకూటమి నేతలు వెల్లడిస్తున్నారు. అధికార టీఆర్ఎస్ తో పోలిస్తే ఆర్థికంగా కాంగ్రెస్ పార్టీ వాళ్లను ఎదుర్కోవటం కష్టమే. అందుకే ఆచితూచి అడుగులు వేస్తున్నారు. నవంబర్ 8 లేదా 9వ తేదీని తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్దుల జాబితాను ప్రకటించనున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు .

అదే సమయంలో పొత్తులో భాగంగా టీడీపీకి 14 సీట్లు కేటాయించనున్నట్లు ఉత్తమ్ వెల్లడించారు. అభ్యర్ధుల జాబితా ఒకేసారి వెల్లడించాలా? లేక దశల వారీగా అన్న దానిపై పార్టీ అధ్యక్షుడు రాహుల్ నిర్ణయం ప్రకారమే ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం మొత్తం 95 స్థానాల్లో బరిలో నిలవనుంది. మిత్రపక్షాలకు మొత్తం 24 సీట్లు కేటాయించనున్నారు. సీపీఐ, తెలంగాణ జనసమితికి కేటాయించే సీట్ల సంఖ్యపై చర్చలు ఇంకా సాగుతూనే ఉన్నాయని తెలిపారు. కూటమి మధ్య సీట్ల సర్దుబాటుపై పూర్తి క్లారిటీ వచ్చిన తర్వాతే అభ్యర్దుల ప్రకటన ఉంటుందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి కుంతియా తెలిపారు.

Next Story
Share it