Telugu Gateway
Politics

ఈ సారి గజ్వేల్ కు మరింత టైమ్ ఇస్తా..14న నామినేషన్

ఈ సారి గజ్వేల్ కు మరింత టైమ్ ఇస్తా..14న నామినేషన్
X

తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కెసీఆర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆదివారం నాడు గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఈ మాటలు అన్నారు. ఈ సారి రాష్ట్రం కోసం పని చేయడంలో ఎక్కువ సమయం కేటాయించానని... వచ్చే టర్మ్ లో గజ్వేల్ కు కూడా కొంత సమయం కేటాయిస్తానని ప్రామిస్ చేస్తున్నా’ అని వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా అసలు స్థానిక నాయకుల దగ్గర నుంచి ఎవరీతోనూ కెసీఆర్ ఈ నాలుగున్నర సంవత్సరాల్లో కలిసింది లేకపోవటంతో అక్కడ అసంతృప్తి ఉందని వార్తలు వస్తున్న తరుణంలో కెసీఆర్ ఈ వ్యాఖ్యలు చేయటం విశేషం. ముఖ్యమంత్రి కావటంతో ఇప్పుడు తన పాత్ర మారిందని..రాష్ట్రంలోని 31 జిల్లాలను చూసుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు.

గజ్వేల్ కు రైలు రావాలి. అది కరీంనగర్ కు వెళ్ళి అక్కడి నుంచి రైట్ కు పోతే ఢిల్లీకి, లెఫ్ట్ పోతే ముంబయికి పోతది. ఈ లైన్ ఈ ప్రాంతానికి ముఖ్యంగా మారుతుందన్నారు. దేశంలో తెలంగాణ ధనిక రాష్ట్రం.. 17.17 వృద్ధి రేటుతో ముందుకు పోతున్నాము. దేశంలో చాలా రాష్ట్రాలు ఇందులో సగం కూడా లేదు. ఇది వట్టిగా రాలేదు.. కడుపు కట్టుకోవాలి.. అవినీతిని రూపుమాపాలి.. అహర్నిశలు శ్రమించాలి. విమర్శించే వాళ్ళను ప్రశ్నించండి అని కెసీఆర్ వ్యాఖ్యానించారు. ఈ నెల 14న 14న నామినేషన్ వేస్తున్నా.. ఎవరూ రావద్దు.. 10 మందిమి కలిసి వెళ్లి వేస్తాను.చివర్లో భారీ ఎత్తున పబ్లిక్ మీటింగ్ పెట్టుకుందామని తెలిపారు. ఈ సారి కేంద్ర రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషించనున్నట్లు కెసీఆర్ వెల్లడించారు. నవంబర్ 15 నుంచి తన ప్రచార పర్యటనలు ఉంటాయని తెలిపారు.

Next Story
Share it