Telugu Gateway
Cinema

విజయ్ ‘ట్యాక్సీవాలా’ విడుదల తేదీ మారింది

విజయ్ ‘ట్యాక్సీవాలా’ విడుదల తేదీ మారింది
X

ఎందుకో కానీ విజయ్ దేవరకొండ ఏ సినిమాకు ఎదుర్కోని రీతిలో ‘ట్యాక్సీవాలా’ సినిమా విడుదలకు సంబంధించి పలు చిక్కులు ఎదుర్కొన్నట్లు కన్పిస్తోంది. ఈ విడుదల తేదీ కోసం ఏకంగా అభిమానుల ఓటింగ్ కూడా కోరారు. వాస్తవానికి ఈ సినిమా నవంబర్ 16న విడుదల అవుతుందని చిత్ర యూనిట్ తొలుత ప్రకటించింది. ఇప్పుడు ఒక రోజు ఆలశ్యంగా నవంబర్ 17న విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని విజయ్ దేవరకొండ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

రాహుల్‌ సంక్రిత్యాన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ట్యాక్సీవాలా సినిమాను యూవీ క్రియేషన్స్‌, గీతాఆర్ట్స్‌ 2 బ్యానర్‌లు సంయుక్తంగా నిర్మించాయి. విజయ్‌ సరసన మాళవిక నాయర్‌, ప్రియాంక జువాల్కర్‌లు హీరోయిన్లుగా నటించారు. గీత గోవిందం సినిమాతో పాటే షూటింగ్‌ పూర్తయినా గ్రాఫిక్స్‌ వర్క్‌ కారణంగా జాప్యం కావటంతో పాటు ఇతర కారణాల వల్ల సినిమాను వాయిదా వేస్తూ వచ్చారు. ఇప్పుడు కొత్త తేదీని ప్రకటించారు.

Next Story
Share it