Telugu Gateway
Cinema

‘ట్యాక్సీవాలా’ రికార్డు కలెక్షన్లు

‘ట్యాక్సీవాలా’ రికార్డు కలెక్షన్లు
X

విజయ్ దేవరకొండ మరోసారి తన సత్తా చాటారు. తొలి రోజు ఏకంగా 10.5 కోట్ల రూపాయల వసూళ్ళు సాధించిన తొలి రోజునే బ్రేక్ ఈవెన్ సాధించిన హీరోగా కొత్త రికార్డు నెలకొల్పారు. ఈ సినిమా విడుదల పలుమార్లు వాయిదా పడటం, విడుదలకు ముందే మొత్తం సినిమా లీక్ అయినా..ఇవేమీ చిత్ర కలెక్షన్లపై ప్రభావం చూపించలేకపోయాయి.

దీనికి యూత్ లో విజయ్ కు ఉన్న క్రేజ్ అని కూడా చెప్పుకోవచ్చు. తొలి రోజు ట్యాక్సీవాలా సినిమా రికార్డు వసూళ్ళను చిత్ర నిర్మాత ఎస్‌కేఎన్‌ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనకు అండగా నిలిచిన విజయ్‌ దేవరకొండ, గీతా ఆర్ట్స్‌, యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లతో పాటు తెలుగు సినీ పరిశ్రమ, మీడియా, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Next Story
Share it