Telugu Gateway
Cinema

ఎన్టీఆర్ సినిమాలో కీర్తిసురేష్!

ఎన్టీఆర్ సినిమాలో కీర్తిసురేష్!
X

టాలీవుడ్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఎందుకంటే ఈ సినిమా దర్శకుడు రాజమౌళి కావటం ఒకెత్తు అయితే..ఇందులో టాలీవుడ్ లో టాప్ హీరోలుగా ఉన్న ఎన్టీఆర్, రామ్ చరణ్ లు నటిస్తుండటమే. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ ఇటు తెలుగుతో పాటు అటు తమిళంలోనూ విజయాలతో దూసుకెళుతోంది. ఎన్టీఆర్, రామ్చరణ్ ల సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ఈ నెల 29 నుంచి మొదలుకానుంది.

రెండవ షెడ్యూల్‌లో కీర్తీసురేశ్‌ పాల్గొననున్నట్లు టాక్‌. టాలీవుడ్ లో కీర్తి సురేష్ చేసిన సినిమాలు అన్నీ ఇంచుమించు మంచి హిట్ టాక్ తెచ్చుకున్నవే. పరిశ్రమలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే కీర్తి సురేష్ ‘సావిత్రి’ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆమెకు పలు భాషల్లో వరస పెట్టి అవకాశాలు వస్తున్నాయి. సావిత్రి సినిమా ద్వారా కీర్తి సురేష్ నటనలో తన సత్తా చాటిన సంగతి తెలిసిందే.

Next Story
Share it