Telugu Gateway
Telangana

నాడు సీఎం సీటిచ్చారు..నేడు సాష్టాంగపడ్డారు!

నాడు సీఎం సీటిచ్చారు..నేడు సాష్టాంగపడ్డారు!
X

అది ప్రగతి భవన్ ప్రారంభోత్సవం. సంప్రదాయబద్ధంగా సీఎం కెసీఆర్ కుటుంబ సభ్యులు అందులోకి ప్రవేశించారు. ఆ కార్యక్రమంలో చినజీయర్ స్వామి కూడా పాల్గొన్నారు. ఇందులో వింతేమీ లేదు. కానీ సీఎం కెసీఆర్ ప్రగతి భవన్ ప్రవేశం సందర్భంగా ఏకంగా సీఎం తన సీటును చినజీయర్ స్వామికి ఇచ్చారు. ముందు చినజీయర్ స్వామి కూర్చున్న తర్వాతే సీఎం కెసీఆర్ ఆ సీటులో కూర్చున్నారు. ఇది అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. సీఎం సీటులో ఓ స్వామిజీని కూర్చోపెట్టడం..తర్వాత అందులో సీఎం కెసీఆర్ కూర్చోవటం కలకలం రేపింది. తాజాగా సీఎం కెసీఆర్ మరోసారి చినజీయర్ స్వామికి సాష్టాంగ నమస్కారం చేశారు. ఓ ప్రధాన పత్రికల్లో వచ్చిన ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సీఎం కెసీఆర్ కు నమ్మకాలు ఎక్కువ అన్న విషయం తెలిసిందే. 2018 లో ఎన్నికలు పూర్తయితేనే రెండవ సారి అధికారంలోకి వస్తారని జ్యోతిష్యులు చెప్పినందునే అసెంబ్లీని సహేతుకమైన కారణాలు లేకుండా రద్దు చేశారని ప్రచారం ఉన్న విషయం తెలిసిందే. వాస్తు సరిగా లేదనే కారణంతోనే అసలు సచివాలయానికే కెసీఆర్ రావటం మానేశారు. వ్యక్తిగతంగా కెసీఆర్ నమ్మకాలు ఎలా ఉన్నా ఎవరూ అభ్యంతర పెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఏకంగా ప్రగతి భవన్ ప్రారంభోత్సవ సమయంలో సీఎం సీటులో చినజీయర్ స్వామిని కూర్చోపెట్టడం..ఇప్పుడు ఆయనకు సాష్టాంగ నమస్కారం చేయటం పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయ్యాయి.

To

Next Story
Share it