Telugu Gateway
Telangana

రాహుల్ కమిషన్ వ్యాఖ్యలపై కెసీఆర్ ఫైర్

రాహుల్ కమిషన్ వ్యాఖ్యలపై కెసీఆర్ ఫైర్
X

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై టీఆర్ఎస్ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసీఆర్ ఫైర్ అయ్యారు. కమిషన్లు తీసుకుంటున్నారనే ఆరోపణలపై ఆయన మండిపడ్డారు. ఇష్టం వచ్చినట్లు కుళ్లు ఆరోపణలు..సొల్లు ఆరోపణలు చేయటం కాదు. మా తెలంగాణ కాంగ్రెస్ దద్దమ్మలు..మీ గులాంలు మీరు ఏది చెపితే అది చేశారు కాబట్టి..వాటిని తీసి పక్కన పడేసి కొత్త ప్రాజెక్టులకు రీడిజైన్ చేశాం. మాకు అవసరం అయ్యే ప్రాజెక్టుల మేం కట్టుకుంటున్నాం. నీకు తెలివి లేక దాన్ని కమిషన్ కోసం మార్చిండు అంటవా? మాకు కావాల్నా కమిషన్. నీకు కావాలంటే నేనిస్తా రా కమిషన్. ఎవడికి కావాలి కమిషన్. మీ లాగా మాది కమిషన్ల బతుకు కాదు..మాది పోరాటాల బతుకు అంటూ రాహుల్ పై ధ్వజమెత్తారు. రాహుల్..జోకర్ లా మాట్లాడుతున్నాడు.

తెలంగాణ రాష్ట్రానికి బానిసలు కావాలా? ఆలోచించాలని ఆయన సభికులను కోరారు. కెసీఆర్ శుక్రవారం నాడు పలు సభల్లో పాల్గొన్నారు. ప్రతి చోటా గెలుపు తమదే అని ధీమా వ్యక్తం చేశారు. వాడెవడో ఇండియా టుడే..మన్ను టుడే..పది సర్వేలు చేస్తే అన్నీ మనమే గెలుస్తాం అని తేల్చాయి. టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుందని డజన్ సర్వేలు చెప్పాయి ఇప్పటికి. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ తెచ్చే బాధ్యత తనదే అని, కేంద్రం మెడలు వంచైనా ఉక్కు ఫ్యాక్టరీ సాధిస్తామని కేసీఆర్‌ తేల్చిచెప్పారు. కేంద్రం ఇవ్వకపోతే సింగరేణితో కలసి అయినా స్టీల్ ప్లాంట్ పెట్టి తీరతామని అన్నారు. ఓటర్లు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని..ఓటు భవిష్యత్ ను నిర్ణయిస్తుందని తెలిపారు. తన లక్ష్యం తెలంగాణను బంగారు తెలంగాణగా చేసి ప్రజలకు అప్పగించటమే అన్నారు.

Next Story
Share it