Telugu Gateway
Cinema

ఎన్టీఆర్..రామ్ చరణ్ ‘ఆర్ ఆర్ ఆర్’ షురూ

ఎన్టీఆర్..రామ్ చరణ్ ‘ఆర్ ఆర్ ఆర్’ షురూ
X

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు నటించే కొత్త సినిమా ఆదివారం నాడు ప్రారంభం అయింది. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ కొత్త సినిమాకు తారక్ రామ్, రామ రావణ రాజ్యం పేర్లు పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ‘ఆర్ ఆర్ ఆర్‘ వర్కింగ్ టైటిల్ తో ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్ ను పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో దర్శకుడు రాజమౌళితోపాటు హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్, దగ్గుబాటి రానా, దర్శకుడు కొరటాల శివ తదితరులు పాల్గొన్నారు. మెగా స్టార్ చిరంజీవి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ సినిమాలో నటించే హీరోయిన్లు..ఇతర నటీ,నటుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చిత్ర యూనిట్ తెలిపింది. బాహుబలి రెండు భాగాల తర్వాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇదే కావటం..ఇందులో ఇద్దరు టాప్ హీరోలు ఉండటంతో సహజంగానే పరిశ్రమలో ఈ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది.

Next Story
Share it