Telugu Gateway
Telangana

మహాకూటమికి నిధులిస్తే మటాషే!..రెండు కీలక సంస్థలకు వార్నింగ్!?

మహాకూటమికి నిధులిస్తే మటాషే!..రెండు కీలక సంస్థలకు వార్నింగ్!?
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు హాట్ హాట్ గా ఉన్నాయి. టీఆర్ఎస్ తిరిగి అధికారం నిలబెట్టుకుంటుందా?. లేక మహాకూటమి అధికారంలోకి వస్తుందా?. ఎవరి మధ్య చూసినా ఇవే చర్చలు. ఎవరూ ఏదీ గ్యారంటీగా చెప్పలేని పరిస్థితి. అధికార టీఆర్ఎస్ పలు అంశాల్లో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోంది. అదే సమయంలో మహాకూటమికి నాయకత్వ సమస్య ఉంది. ఎన్నికలు అంటే నిధులు ఏరులై పారాల్సిందే. అధికార పార్టీకి నిధుల సమస్య పెద్దగా ఉండదు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీలే అధికార పార్టీనీ ఢీకొట్టి నిలబడాలంటే భారీ ఎత్తున వనరులు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. గెలుపు అవకాశాలు ఉన్నాయంటే అలాంటి పార్టీకి బడాబడా కార్పొరేట్ సంస్థలు తమ వంతు సాయం చేస్తూనే ఉంటాయి. ఇప్పుడు తెలంగాణతోపాటు ఏపీలో చక్రం తిప్పుతున్న రెండు బడా సంస్థలకు ఓ కీలక నేత నుంచి వార్నింగ్ వెళ్లినట్లు కార్పొరేట్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇది దేనికీ అంటే..మహాకూటమికి ఎన్నికల నిధులిస్తే మటాషే..మళ్ళీ అధికారంలోకి వచ్చేది మేమే..జాగ్రత్త అంటూ హెచ్చరిక సంకేతాలు పంపారట.

ప్రస్తుతం రాష్ట్రంలోని అగ్రశ్రేణి కంపెనీల అధినేతలెవరూ అందుబాటులో లేకుండా విదేశాలకు వెళ్ళటమే లేక..ఫోన్లు ఆఫ్ చూసి కూర్చోవటమే చేస్తున్నారు?. దీనికి ప్రధాన కారణం ఎన్నికల ఖర్చుల కోసం చాలా మంది నేతలు బడా కాంట్రాక్టర్లను ఆశ్రయిస్తుండటమే. అందుకే వీరు చాలా ముందస్తుగా ఏర్పాట్లు చేసుకుని జంప్ అయినట్లు చెబుతున్నారు. ఎన్నికల సమయం ఓ రకంగా చెప్పాలంటే కార్పొరేట్ కంపెనీలకు కూడా కత్తిమీద సాములాంటిదే. ప్రతిపక్ష పార్టీలకు డబ్బులు ఇవ్వకపోతే వాళ్లు అధికారంలోకి వస్తే ఓ సమస్య. ఇస్తే.. ఆ విషయం ఇప్పటికే అధికారంలోకి ఉన్న వారికి తెలిస్తే మరో సమస్య. మళ్ళీ అదే పార్టీ అధికారంలోకి వస్తే..ఎక్కడ వేటు పడుతుందోనన్న భయం. అయితే ఆయా కంపెనీలు ఎన్నికల ఖర్చుల సర్దుబాటుకు ‘పలు మార్గాలు’ అనుసరిస్తున్నట్లు చెబుతున్నారు.

Next Story
Share it