Telugu Gateway
Cinema

కాజల్ కు ముద్దుపై చోటా వివరణ

కాజల్ కు ముద్దుపై చోటా వివరణ
X

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన ‘కవచం’ సినిమా టీజర్ విడుదల కార్యక్రమంలో ఎవరూ ఊహించని ఘటన జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో శ్రీనివాస్ తోపాటు...హీరోయిన్లు కాజల్, మెహరీన్, చోటా కే నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఆ వేదికపై హీరోయిన్ కాజల్ మాట్లాడుతూ అందరి గురించి చెబుతూ..సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడి గురించి కూడా ప్రస్తావించి..ఆయనకు ధ్యాంక్స్ చెప్పారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన చోటా కే నాయుడు కాజల్ దగ్గరికి వెళ్లి ఆమెకు ముద్దు పెట్టారు. అంతే..ఆ వీడియో..పోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో చోటా కె నాయుడు ఈ వ్యవహారంపై వివరణ ఇచ్చుకున్నారు. సినీ పరిశ్రమలో దివంగత హీరోయిన్ సౌందర్య తర్వాత కాజల్ అంటే ఎంతో అభిమానం అని..కాజల్ తనను కుటుంబ సభ్యుడిగా భావిస్తుందని పేర్కొన్నారు.

తాను ఆమెతో తప్పుగా ప్రవర్తించలేదని తెలిపారు. తాను కాజల్ తో కలసి ఎన్నో చిత్రాలు చేసినట్లు తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా తాము మంచి స్నేహితులం అని చోటా వెల్లడించారు. ఓ మంచి సినిమా కోసం సంతకం చేసినట్లు కాజల్ ప్రకటించిన సమయంలో సంతోషంతో ముద్దుపెట్టుకున్నాను అని తెలిపారు. అయితే ఈ ఘటనపై హీరోయిన్ కాజల్ మాత్రం బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. చోటా కే నాయుడు మద్దు పెట్టుకున్న సమయంలో కూడా ఆమె నవ్వుతూనే ఉన్నారు.

Next Story
Share it