Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబు రాజకీయ అవసరాల ముసుగే ‘సేవ్ నేషన్..సేవ్ డెమాక్రసీ’

చంద్రబాబు రాజకీయ అవసరాల ముసుగే ‘సేవ్ నేషన్..సేవ్ డెమాక్రసీ’
X

తెలుగుదేశం పార్టీ ఆకస్మాత్తుగా కాంగ్రెస్ చంకలో చేరింది. నిన్న మొన్నటివరకూ బిజెపితో కలసి సాగిన ఆ పార్టీ ఇప్పుడు బిజెపి నమ్మించి మోసం చేసింది. ఏపీకి కాంగ్రెస్ ప్రత్యేక హోదా ఇస్తానంటోంది. ఏపీ ప్రజలు ఒకసారి కాంగ్రెస్ ను శిక్షించారు కాబట్టి ఇక వదిలేయవచ్చని చంద్రబాబు చెబుతున్నారు. మరి పోలవరం ప్రాజెక్టు అక్రమాలపై పోరాడుతున్న కాంగ్రెస్ ఎంపీ కెవీపీ రామచంద్రరావు ఇప్పుడు చంద్రబాబుకు ఆత్మబంధువు అయిపోతారా?.

రాబోయే రోజుల్లో చంద్రబాబు, కెవీపీలు కలసి ఏపీ ప్రయోజనాల కోసం పాటుపడతారా?. పాత చరిత్ర వదిలేద్దాం..కొత్త అధ్యాయం లిఖిద్దాం అంటూ రాహుల్ గాంధీ, చంద్రబాబులు దేశానికి సందేశం ఇచ్చారు. ఈ కలయిక రాజకీయ అవసరాల కోసమే అని అందరీకి తెలుసు. కానీ దీనికి తొడిగిన ముసుకు ‘సేవ్ నేషన్, సేవ్ డెమాక్రసీ’. ఈ వ్యవహారంపై వాట్సప్ గ్రూపుల్లో ఓ మెసేజ్ సంచలనం సృష్టిస్తోంది. అదేంటో మీరూ చూడండి.

*ఎన్టీఆర్ ను దించటం చారిత్రక అవసరం అంటే సరే అన్నాం

*కాంగ్రెస్ ను సమాధి చేయండి అంటే చిత్తం అన్నాం

*సోనియాను ఇటలీ మాఫియా అంటే నమ్మాం

* ఏపీలో అడుగుపెట్టడానికి రాహుల్ గాంధీ సిగ్గులేదా? అంటే తందానా అన్నాం

*హోదా పదేళ్లు కాదు..పదిహేను సంవత్సరాలు అంటే ఓహో అనుకున్నాం

*హోదా కంటే ప్యాకేజీ బాగుంటుందని భళా భళా అంటూ చిడతలు కొట్టాం

*తూచ్..ప్యాకేజీ కాదు..హోదానే కావాలంటే తానా దందానా అన్నాం

*మోడీకి జై అంటే జై అన్నాం

*మోడీపై యుద్ధం అంటే సై అన్నాం

*మోడీని దించేస్తా అంటే ఎస్ అనాలి

*జై రాహుల్ అంటే జేజేలు కొట్టాలి

Next Story
Share it