Telugu Gateway
Movie reviews

అమర్..అక్బర్..అంటోనీ మూవీ రివ్యూ

అమర్..అక్బర్..అంటోనీ మూవీ రివ్యూ
X

శ్రీనువైట్ల అంటే కామోడీ. ఎలాంటి హీరోతో అయినా తనదైన మార్క్ కామెడీ చేయించటంలో ఆయన దిట్ట. అందులో రవితేజ అంటే ఎనర్జిటిక్ హీరో. చాలా కాలం తర్వాత రవితేజ, ఇలియానా జంటగా సినిమా వస్తుంది అంటే సహజంగా ప్రేక్షకుల్లో అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన అమర్..అక్బర్..అంటోనీ సినిమా ఎలాంటి జీవం లేకుండా ప్రేక్షకులను పూర్తిగా నిరాశపర్చిందనే చెప్పొచ్చు. స్టోరీ లైన్ కూడా ఇప్పటికే పలు సినిమాల్లో వచ్చింది కావటం..అదే రొటీన్ స్టోరీ..ఓ బడా కంపెనీ..ఇద్దరు స్నేహితులు..వాళ్ళను మోసం చేసిన వాటాదారులుగా మారిన ఉద్యోగులు. తిరిగి వారిపై ప్రతీకారం. ఇదీ స్టోరీ లైన్. టైటిల్ చూస్తే ఎవరైనా ఈ సినిమాలో రవితేజ త్రిపాత్రాభినయం చేశారని అనుకుంటారు. కానీ ఒక్క వ్యక్తి ఏకంగా ఒక్కో సంఘటన జరిగినప్పుడు ఒక్కో పాత్రల్లోకి ప్రవేశించటం కూడా ఏ మాత్రం అతకలేదు. గ్లాస్ పగిలిన శబ్దం వస్తే ఒకలా...మరో సంఘటన చూసినప్పుడు మరోలా వ్యవహరించటం అన్నది ప్రేక్షకులకు ఏ మాత్రం కనెక్ట్ కాలేదు. సహజంగా రవితేజ సినిమాల్లో జోష్ ఉంటుంది.

కానీ విచిత్రం ఈ సినిమాలో ఏ ఒక్క పాత్రలో కూడా అది కన్పించలేదు. సినిమాలో కాస్తో కూస్తో నవ్వించాడు అంటే జూనియర్ పాల్ పాత్రలో నటించిన కమెడియన్ సత్యనే. అమెరికాలో జరిగే ‘హోల్ ఆంధ్రా, తెలంగాణ అసోసియేన్ (వాటా) సమావేశాల పేరుతో జరిగే ఈవెంట్ వ్యవహారాలు కూడా అత్యంత సాదాసీదాగా ఉండి ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తాయి. రవితేజలో గత సినిమాల స్పీడ్ ఏ మాత్రం ఇందులో కన్పించలేదు. ఇలియానా చాలా రోజుల తర్వాత తెలుగు సినిమాలో నటించినా ఆమె పాత్రకు ఏ మాత్రం ప్రాముఖ్యత లేదు. వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి పాత్రలు కూడా పెద్దగా నవ్వించలేదు. సినిమా అంతా అమెరికాలో షూటింగ్ చేయటంతోపాటు..నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కావటంతో రిచ్ నెస్ ఏ మాత్రం తగ్గలేదు. కానీ అంతిమంగా అమర్...అక్బర్..అంటోనీ ఓ సాదాసీదా సినిమా.

రేటింగ్.2/5

Next Story
Share it