Telugu Gateway
Andhra Pradesh

జ‌గ‌న్ డిశ్చార్జ్

జ‌గ‌న్ డిశ్చార్జ్
X

విశాఖ విమానాశ్ర‌యంలో క‌త్తి దాడికి గురైన ప్రతిప‌క్ష నేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి శుక్ర‌వారం మ‌ధ్యాహ్నాం ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్చ్ అయ్యారు. వైద్యులు ప‌రీక్షలు నిర్వ‌హించిన త‌ర్వాత ఎలాంటి ప్ర‌మాదం లేద‌ని నిర్ధారించ‌టంతో ఆయ‌న్ను ఇంటికి పంపారు. దాడికి ఉప‌యోగించిన క‌త్తిలో ఏమైనా విష ప‌దార్ధాలు ఉన్నాయోమో అని వైసీపీ నేత‌లు అనుమానం వ్య‌క్తం చేశారు. దీంతో శంషాబాద్ విమానాశ్ర‌యానికి చేరుకున్న వెంట‌నే ఆయ‌న నేరుగా ఆస్ప‌త్రికి వెళ్ళారు. వైఎస్‌ జగన్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్‌ శివా రెడ్డి తెలిపారు.

గురువారం రాత్రి గాయం కారణంగా నొప్పితో జగన్‌ ఇబ్బందిపడటంతో పెయిన్‌ కిల్లర్‌ ఇచ్చామన్నారు. గాయం మానడానికి కొంత సమయం పడుతుందని తెలిపారు. కండరానికి, చర్మానికి కలిపి 8 కుట్లు పడ్డాయన్నారు. రక్తం నమూనాలను ల్యాబ్‌లకు పంపామన్నారు. డిశ్చార్జ్‌ అయిన తర్వాత కూడా వైఎస్‌ జగన్‌ కొన్ని టెస్టులకు మళ్లీ రావాల్సి ఉంటుందన్నారు. టెస్టులన్నీ నార్మల్‌గా వచ్చి, గాయం మాని కుట్లు తీసే వరకు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.

Next Story
Share it