Telugu Gateway
Cinema

ఎన్టీఆర్ లో విద్యాబాలన్ లుక్ విడుదల

ఎన్టీఆర్ లో విద్యాబాలన్ లుక్ విడుదల
X

ఎన్టీఆర్ సినిమా విడుదలకు ముందే ఎన్నో సంచలనాలు నమోదు చేస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పాత్రల లుక్స్ అన్నీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రను ఈ సినిమాలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ చేస్తున్న సంగతి తెలిసిందే. స్వయంగా విద్యాబాలనే తన లుక్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు.

విద్యాబాలన్ మేకప్‌ రూమ్‌లో అద్దం ముందు కూర్చున్న తన ఫోటోకు ‘నేనేం చూస్తున్నాను..?’ అన్న కామెంట్‌ను యాడ్ చేశారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రలో నటిస్తుండంగా కల్యాణ్ రామ్‌.. హరికృష్ణగా, రానా దగ్గుబాటి.. చంద్రబాబు నాయుడిగా, సుమంత్‌.. నాగేశ్వరరావు పాత్రల్లో కనిపిస్తున్నారు. ఈ సినిమాను 2019 జనవరిలో రెండు భాగాలుగా విడుదల కానుంది.

Next Story
Share it