Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

ఇల్లు త‌ప్పిపోవ‌టం ఏంట్రా!

0

ఈ మాట ఎప్పుడైనా ఊహించారా? ఇల్లు త‌ప్పిపోవ‌టం ఎక్క‌డైనా ఉంటుందా?. అదే ఇక్క‌డ స‌స్పెన్స్. ఆ డైలాగ్ సినిమాపై ఉత్కంఠ‌ను పెంచుతోంది. వీర‌భోగ వ‌సంత‌రాయ‌లు సినిమా ట్రైల‌ర్ లో ఓ కుర్రాడు ఇదే డైలాగ్ చెబుతాడు. ఇది విన్న పోలీసు అధికారి అవాక్కు అవుతారు. ఇలాంటి అద్భుతాన్ని విన‌టం కంటే చూస్తే బాగుంటుంది క‌దా? అంటూ పోలీసు పాత్ర‌
పోషిస్తున్న హీరో సుధీర్ బాబు బ‌య‌లుదేరుతారు. ఇదంతా వీర‌భోగ వ‌సంత‌రాయ‌లు సినిమా ట్రైల‌ర్ లోని స‌న్నివేశాలు. ట్రైల‌ర్ ను చిత్ర యూనిట్ మంగ‌ళ‌వారం నాడు విడుద‌ల చేసింది. ఈ సినిమా అక్టోబ‌ర్ 28న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రీ విష్ణు, శ్రియ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘వీర భోగ వసంత రాయలు’.                                                               డిఫరెంట్‌ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది. క్రైమ్‌ థ్రిల్లర్‌ జానర్ మూవీ ఇది. సినిమాలోని ప్రధాన పాత్రల ఫస్ట్‌లుక్స్‌ను ఒక్కొక్కటిగా రిలీజ్ చేసిన యూనిట్ తరువాత టీజర్‌తో ఆకట్టుకున్నారు. కిడ్నాప్‌, ఫ్లైట్‌ హైజాక్‌ లాంటి సీన్స్‌ తో ట్రైలర్‌ను ఆసక్తికరంగా రెడీ చేశారు. నారా రోహిత్, సుధీర్‌ బాబు, శ్రియలు పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌కు చెందిన వ్యక్తులుగా కనిపిస్తుండగా శ్రీ విష్ణు డిఫరెంట్‌ లుక్‌లో నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో కనిపిస్తున్నాడు. ఆర్.ఇంద్రసేన దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మార్క్ కే రాబిన్ సంగీతం అందిస్తున్నారు.

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.