Telugu Gateway
Telangana

ఆదిలాబాద్ టీఆర్ఎస్ లో ‘కల్లోలం’!

ఆదిలాబాద్ టీఆర్ఎస్ లో ‘కల్లోలం’!
X

ముందస్తు ఎన్నికల వేళ ఆదిలాబాద్ టీఆర్ఎస్ కు షాక్ మీద షాక్. నిర్మల్ నియోజకవర్గంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి వ్యతిరేకంగా అందరూ ఏకమవగా..అదే జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ రాములు నాయక్ కూడా టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. దీంతో ఒక్కసారిగా టీఆర్ఎస్ లో కలకలం. ఇదే జిల్లాలోనే కాదు..పలు చోట్ల అభ్యర్ధులు ప్రచారానికి వెళ్లినప్పుడు కూడా వారికి వ్యతిరేకత ఎదురవుతోంది. ఆదివారం నాడు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి సొంత నియోజకరవర్గం నిర్మల్‌లో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆయన అనుచరుడు, నిర్మల్ మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్‌తోపాటు పలువురు కౌన్సిలర్లు మంత్రికి ఎదురుతిరిగారు. టీ ఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. తర్వలోనే కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు నిర్మల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ అప్పాల గణేష్, ఆయన మద్దతుదారులైన కౌన్సిలర్లు రంగం సిద్ధం చేసుకున్నారు. మంత్రి తీరు నచ్చకపోవడంతో పార్టీ మారాలని వారు నిర్ణయించుకున్నారని, త్వరలో రాహుల్‌గాంధీ సమక్షంలో వారు కాంగ్రెస్‌ పార్టీలో చేరబోతున్నారని సమాచారం.

అధికార పార్టీలోని అసంతృప్త నేతలను గాలం వేసేందుకు ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. దీని వల్ల ఆ పార్టీ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయవచ్చన్నది వీరి అంచనా. తాజాగా ఆ పార్టీ ఎమ్మెల్సీ రాముల్‌ నాయక్‌ కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు సమాచారం. గోల్కొండ హోటల్‌లో కాంగ్రెస్‌ తెలంగాణ ఇన్‌చార్జి కుంతియాను టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఆదివారం కలిశారు. తనకు ఇల్లందు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని రాములు నాయక్ కోరుతున్నట్టు సమాచారం. టిక్కెట్ పై హామీ లభిస్తే ఆయన పార్టీ మారటం ఖాయంగా చెబుతున్నారు.

Next Story
Share it