Telugu Gateway
Telangana

ప్రధాన ఛానల్ లో సంక్షోభం!

ప్రధాన ఛానల్ లో సంక్షోభం!
X

ఎన్నికల వేళ ‘ప్యాకేజీల’ కింద కోట్లకు కోట్లు గడిస్తున్నా రెండేళ్లుగా జీతాలు పెంచకుండా ఉన్న ఆ ఛానల్ ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతుందా?. అంటే అవుననే చెబుతున్నారు. ఆ ఛానల్ లో పనిచేసే ఉద్యోగులు యాజమాన్య వైఖరితో వరస పెట్టి ‘జంపింగ్’లు చేస్తున్నారు. పలు విభాగాల్లోని సిబ్బంది ఇప్పటికే బయటపడగా..మరికొంత మంది అదే బాటలో ఉన్నారు. అత్యంత కీలకమైన వీడియో ఎడిటర్లు సగంపైనే గుడ్ బై చెప్పి కొత్త ఛానల్ లోకి వెళ్లారు. అయితే ఆ యాజమాన్యంతో మాట్లాడి తమ దగ్గర నుంచి వచ్చేవారిని తీసుకోవద్దని ‘బేరాల’కు దిగినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఛానల్ పరంగా అటు ఆదాయంలోనూ..రేటింగ్ లోనూ కీలక స్థానంలో ఉన్నా యాజమాన్య వైఖరి అక్కడి పనిచేసే ఉద్యోగులకు చుక్కలు చూపిస్తోంది. దీంతో వీళ్లంతా ఎప్పుడు బయటపడదామా? అనే ప్రయత్నాల్లో ఉన్నారు.

నిలకడ లేని నిర్ణయాలు...ఉద్యోగులపై దుర్భాషలు వంటి చర్యలతో అక్కడి స్టాఫ్ హడలిపోతున్నారు. యాజమాన్యం పరిస్థితి ఎంత దారుణం అంటే హుద్ హుద్ సందర్భంగా ఉద్యోగులకు సంబంధించి రెండు రోజుల జీతాలు అయితే కట్ చేశారు. కానీ ఆ మొత్తాన్ని ఇప్పటివరకూ సర్కారుకు అందజేయలేదు. ఈ విషయాన్ని యాజమాన్యానికి అత్యంత సన్నిహితంగా ఉండే వారు బహిరంగంగా చెబుతున్నారు. ఇదే తరహాలో కేరళ తుఫాను అప్పుడు కూడా ఉద్యోగుల వేతనాలకు కోత పెట్టేందుకు రెడీకాగా..వారంతా ఆసక్తి చూపకపోవటంతో యాజమాన్యం వెనక్కి తగ్గింది. తమ ఛానల్ లో ఎప్పుడు ఏ పరిస్థితి తలెత్తుతుందో అన్న టెన్షన్ లో ఉద్యోగులు హడలిపోతున్నారు.

Next Story
Share it