Telugu Gateway
Cinema

నిరాశపర్చిన ప్రభాస్ ‘బర్త్ డే గిఫ్ట్’!

నిరాశపర్చిన ప్రభాస్ ‘బర్త్ డే గిఫ్ట్’!
X

ప్రతిష్టాత్మక సినిమా బాహుబలి రెండు భాగాల తర్వాత ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘సాహో’. ఫస్ట్ లుక్ మినహా ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకూ పెద్దగా అప్ డేట్స్ ఏమీ రాలేదు. కానీ హీరో ప్రభాస్ పుట్టిన రోజును పురస్కరించుకుని చిత్ర యూనిట్ ‘షేడ్స్ ఆఫ్ సాహో’ పేరుతో ఓ వీడియోను విడుదల చేసింది. అయితే ఈ వీడియోలో యాక్షన్ సన్నివేశాల లుక్స్ ఓకే కానీ..ప్రభాస్ ఎంట్రీ మాత్రం అత్యంత సాదాసీదాగా..గతంలో చాలా సినిమాల్లో చూసిన సీన్లనే తలపించింది. బాహుబలి తర్వాత ఈ హీరో చేస్తున్న సినిమా కావటంతో ఆయన అభిమానులకు దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. సుమారు 300 కోట్ల బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని టాక్.

ఇప్పటికే సాహో షూటింగ్ మేజర్‌ పార్ట్‌ పూర్తయింది. యాక్షన్‌ సీన్స్‌ కు సంబంధించిన మేకింగ్‌ వీడియోతో పాటు ప్రభాస్‌, అరుణ్‌ విజయ్‌, హీరోయిన్‌ శ్రద్ధా కపూర్‌లను కూడా ఈ వీడియోలో చూపించారు. ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటులు నీల్‌ నితిన్‌ ముఖేష్, జాకీ ష్రాఫ్‌, మందిరా బేడి తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ సంస్థ భారీ నిర్మిస్తున్న ఈ సినిమాకు సుజిత్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

https://www.youtube.com/watch?v=huw6wD_1ppE

Next Story
Share it