Telugu Gateway
Cinema

అదరగొడుతున్న ‘సవ్యసాచి’ ట్రైలర్

అదరగొడుతున్న ‘సవ్యసాచి’ ట్రైలర్
X

సవ్యసాచి ట్రైలర్ అదరగొడుతోంది. అక్కినేని నాగచైతన్య యాక్షన్ సన్నివేశాలు..మాధవన్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. డైలాగులు కూడా అంతే పవర్ ఫుల్ గా ఉన్నాయి. ట్రైలర్ చూస్తే ఈ సినిమా నాగచైతన్యకు మరో హిట్ ఇచ్చేలా కన్పిస్తోందని ఆయన అభిమానులు కుషీకుషీగా ఉన్నారు. తొలిసారి నాగచైతన్యకు జోడీగా నిధి అగర్వాల్ చేస్తోంది. ఈ సినిమా నవంబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

విడుదల తేదీ సమీపించటంతో చిత్ర యూనిట్ బుధవారం నాడే ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. తొలిసారిగా మాధవన్‌ ఈ సినిమాతో విలన్‌గా తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు. తన ఎడమ చేతి కారణంగా ఇబ్బందులు ఎదుర్కొనే పాత్రలో హీరో నాగచైతన్య కనిపిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. కార్తీకేయ, ప్రేమమ్‌ లాంటి హిట్ చిత్రాలను అందించిన చందూ మొండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

https://www.youtube.com/watch?v=An9lC-F_HMg

Next Story
Share it