Telugu Gateway
Cinema

సవ్యసాచి టైటిల్ సాంగ్ విడుదల

సవ్యసాచి టైటిల్ సాంగ్ విడుదల
X

అక్కినేని నాగచైతన్య, నిధి అగర్వాల్ జంటగా నటించిన సినిమా సవ్యసాచి. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమా నవంబర్ 2న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాల్లో ఉంది. అందులో భాగంగా వరస పెట్టి పాటలు విడుదల చేయటంతో పాటు..ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు.

కార్తీకేయ, ప్రేమమ్‌ లాంటి హిట్ చిత్రాలను అందించిన చందూ మొండేటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా విడుదల చేసిన టైటిల్ సాంగ్ పూర్తిగా సంస్కృత పదాలతో సాగింది. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో సీనియర్‌ నటుడు మాధవన్‌, భూమిక ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

https://www.youtube.com/watch?v=Aq5uuezrOwQ

Next Story
Share it