Telugu Gateway
Cinema

చంద్ర‌బాబును ప‌ట్టుకున్న వ‌ర్మ‌

చంద్ర‌బాబును ప‌ట్టుకున్న వ‌ర్మ‌
X

రామ్ గోపాల్ వ‌ర్మ ప్ర‌య‌త్నాలు ఫ‌లించాయి. ఆయ‌న వెతుకుతున్న చంద్ర‌బాబును పోలిన మ‌నిషి అడ్ర‌స్ ను ప‌ట్టేశారు. ఈ మేర‌కు వ‌ర్మ‌కు ఈ మెయిల్ సందేశం అందింది. అంతే కాదు దీనికి వ‌ర్మ ముందు ప్ర‌క‌టించిన‌ట్లుగా ల‌క్ష రూపాయ‌ల న‌జ‌రానా పంపిస్తాను...ఖాతా వివ‌రాలు పంపాల‌ని కోరారు . ఈ మేర‌కు ట్విట్ట‌ర్ లో పోస్టులు పెట్టారు. ఓ మీడియా సంస్థ‌లో ప‌నిచేసే రోహిత్ ముత్యాల ఈ స‌మాచారాన్ని వ‌ర్మ‌కు చేర‌వేశారు. ఈ విష‌యాన్ని కూడా వ‌ర్మ వెల్ల‌డించారు. కొద్ది రోజుల క్రితం

ప‌క్క‌న పెట్టేసిన లక్ష్మీస్‌ ఎన్టీఆర్ సినిమాను మ‌ళ్ళీ తెర‌కెక్కించాల‌ని రామ్ గోపాల్ వ‌ర్మ నిర్ణ‌యించుకున్నారు.

ఈ సినిమాకు చంద్ర‌బాబు పాత్ర చాలా కీల‌కం కావ‌టంతో అచ్చం చంద్ర‌బాబును పోలి ఉన్న ఆయ‌న్ను వెతికి ప‌ట్టుకున్నారు వ‌ర్మ‌. మ‌రి ఆయ‌న ఈ పాత్ర చేయ‌టానికి అంగీక‌రిస్తారా? వ‌ర్మ కోరిక‌ను మ‌న్నిస్తారా? వేచిచూడాల్సిందే. మొత్తానికి ఏదో ఒక రకంగా వ‌ర్మ త‌న సినిమా నిత్యం వార్త‌ల్లో ఉండేలా చూసుకోవ‌టంలో దిట్ట అని మ‌రోసారి

నిరూపించుకున్నారు. ఓ వైపు బాలక్రిష్ణ ఎన్టీఆర్ బ‌యోపిక్ ను రెండు భాగాలుగా తెర‌కెక్కిస్తుంటే..వ‌ర్మ లక్ష్మీపార్వ‌తి కోణంలో సినిమాను తెస్తున్న‌ట్లు క‌న్పిస్తోంది. ఇది వివాద‌స్ప‌దం

అవుతుందో వేచిచూడాల్సిందే.

Next Story
Share it