Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

ఎన్టీఆర్, రామ్ చరణ్ కొత్త సినిమా నవంబర్ 5న ప్రారంభం

0

దర్శక దిగ్గజం రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో తెరకెక్కించనున్న భారీ మల్టీస్టారర్ చిత్రం షూటింగ్ ముహుర్తం ఖరారైంది. నవంబర్ 5న ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభం కానుంది. మరో  కొత్త విశేషం ఏమిటంటే ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉండబోతున్నారు. వారు ఎవరన్నది బహుశా చిత్ర షూటింగ్ ప్రారంభం రోజు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఎన్టీఆర్ తాజా చిత్రం అరవింద సమేత వీరరాఘవ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. రాజమౌళి సినిమా కోసం ఎన్టీఆర్ మరో సారి కొత్త లుక్ లో కన్పించబోతున్నారు.

- Advertisement -

ఇప్పటికే ఈ కసరత్తు ప్రారరంభించారు.  బాహుబలి పార్ట్ వన్, టూ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఇదే కావటం విశేషం. ఈ సినిమాకు భారీ చిత్రాలను నిర్మించే డీవీవీ ఎంటర్ టైనన్ మెంట్స్ అధినేత  డీవీవీ దానయ్యే. ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. టాలీవుడ్ లో ఫుల్ స్వింగ్ లో ఉన్న హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ ల మల్టీస్టారర్ అంటే ఈ సినిమాపై ఆసక్తి  ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు.

Leave A Reply

Your email address will not be published.