Telugu Gateway
Cinema

అర‌వింద స‌మేత సెన్సార్ పూర్తి

అర‌వింద స‌మేత సెన్సార్ పూర్తి
X

ఎన్టీఆర్ కొత్త సినిమా అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ సినిమా సెన్సార్ పూర్త‌యింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుంచి యు-ఏ స‌ర్టిఫికెట్ ల‌భించింది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ సినిమా అక్టోబ‌ర్ 11న విడుద‌ల కానున్న విష‌యం తెలిసిందే. వినూత్న క‌థాంశాల‌తో సినిమాలు తెర‌కెక్కించే ద‌ర్శ‌కుడు..మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్, ఎన్టీఆర్ కాంబినేష‌న్ లో ఈ సినిమా వ‌స్తుండ‌టంతో దీనిపై భారీ ఎత్తున అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. రాయ‌ల‌సీమ బ్యాక్ డ్రాప్ లో సినిమా ఈ సినిమా తెర‌కెక్కింది. ఈ సినిమాలోని పాట‌లు ఎన్టీఆర్ అభిమానుల‌ను విశేషంగా ఆక‌ట్టుకున్నాయి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఇంకో శుభ‌వార్త ఏంటంటే ఏపీలో ఈ సినిమా అద‌న‌పు షోల‌కు కూడా ప్ర‌భుత్వం అనుమ‌తి మంజూరు చేసింది. దీంతో ఫ్యాన్స్ కుషీకుషీగా ఉన్నారు. ఓవ‌ర్సీస్ లో కూడా అర‌వింద స‌మేత కొత్త రికార్డులు నెల‌కొల్పుతుంద‌ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ధీమాతో ఉన్నారు.

Next Story
Share it