Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

ఎన్టీఆర్ బయోపిక్ లో హరికృష్ణ లుక్ చూశారా?

0

ఎన్టీఆర్ బయోపిక్ పాత్రలు ఆకట్టుకుంటున్నాయి. సినిమాలో కీలక పాత్రలకు సంబంధించిన ‘లుక్స్’ అన్నీ ఇప్పటికే బయటకు వచ్చాయి. తాజాగా హరికృష్ణ కు సంబంధించిన లుక్ కూడా వచ్చేసింది. ఈ పాత్రను హరికృష్ణ తనయుడు నందమూరి కళ్యాణ్ రామ్ చేస్తున్న సంగతి తెలిసిందే. దసరా సందర్భంగా ఈ హరికృష్ణ లుక్ ను విడుదల చేశారు. బాలకృష్ణ ఠీవిగా కూర్చుని వుండగా కళ్యాణ్‌రామ్‌ ఆయన పక్కన వంగి ఉన్నట్టుగా బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటో అభిమానులకు కనువిందు చేస్తోంది.

- Advertisement -

‘విజయం మీది.. విజయరథ సారధ్యం నాది.. నీడలా వెన్నంటి వుంటా నాన్నగారూ’ అంటూ డైలాగ్‌ కూడా ఫోటోకు జతచేశారు. నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తూ, నటిస్తోన్న ఈ సినిమా రెండు భాగాలుగా గా రానుంది. విద్యాబాలన్‌, దగ్గుబాటి రానా ఇతర  ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. జాగర్లమూడి క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కథానాయకుడు జనవరి 9, మహానాయకుడు జనవరి 24న విడుదల కానున్నాయి.

 

 

Leave A Reply

Your email address will not be published.