Telugu Gateway
Andhra Pradesh

ఐటి శాఖలో లోకేష్ ‘ఇష్టారాజ్యం’!

ఐటి శాఖలో లోకేష్ ‘ఇష్టారాజ్యం’!
X

కంపెనీ కంపెనీకి ఓ లెక్క. అసలు ‘ఆ లెక్క’ వెనక ఉద్దేశం ఏంటి?. బినామీలకు ఓ రేటు?. రియల్ గా బిజినెస్ చేసే వాళ్ళకు ఓ రేటా?. అసలు ఐటి సంస్థలకు భూ కేటాయింపుల నిర్ణయాల వెనక హేతుబద్దత ఎక్కడ ఉంది?. విశాఖపట్నంలోనే 9.5 ఎకరాల్లో యూనిట్ ఏర్పాటు చేస్తామని ముందుకొచ్చిన కాండెంట్ బిజినెస్ సర్వీసెస్ ఇండియాకు ఎకరా 55 లక్షల రూపాయల లెక్కన భూమి కేటాయించాలని నిర్ణయం. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ తో పోలిస్తే ఈ సంస్థ ఇస్తామన్న ఉద్యోగాల సంఖ్య చాలా ఎక్కువ. అలాంటప్పుడు ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చే సంస్థకు తక్కువ రేటు ఇవ్వాల్సింది పోయి...తక్కువ ఉద్యోగాలు ఇచ్చే సంస్థకు 40 ఎకరాల భూమి. అందులో మళ్ళీ చౌక బేరం. భూమి ఎక్కువ. రేటు తక్కువ. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కు 32.5 లక్షల లెక్కన ఎకరా కేటాయించాలని నిర్ణయించారు. మరి అదే కాండెంట్ బిజినెస్ సర్వీసెస్ ఇండియాకు ఇఛ్చే భూమి తక్కువ. రేటు ఎక్కువ. దీని వెనక మతలబు ఏమిటి?. ఐటి రంగం ప్రమోషన్ పేరుతో ఆ శాఖ కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా చెప్పుకోదగ్గ స్థాయిలో కంపెనీలు ఏపీకి రావటం లేదు. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వం..ఐటి శాఖలో నెలకొన్న అవినీతి కూడా ఓ కారణం అనే విమర్శలు ఉన్నాయి.

ఎపీఎన్ఆర్ టి, ఏపీ ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డు ఇలా పలు సంస్థలు ఐటి రంగ ప్రమోషన్ కోసం పనిచేస్తున్నామని చెబుతూ...అస్మదీయ సంస్థలకు అడ్డగోలుగా మేలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. దీని వెనక పెద్ద స్కీమ్ ఉందని ఆ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏపీకి ఐటి కంపెనీలను తేవటంలో మా కష్టం ఎంతో ఉంది. మేం కాక ఇంకెవరైనా ఇలా తేగలరా?. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ప్రతిపక్ష నేత జగన్ ఎవరు తెచ్చినా ఇదే రాయితీలు ఇస్తాం తెస్తారా? అంటూ అసెంబ్లీ సాక్షిగా లోకేష్ సవాళ్ళు విసిరారు. తరచి చూస్తే ఐటి శాఖను లోకేష్ తన ఇష్టారాజ్యం మార్చేశారు. తనకు నచ్చిన కంపెనీలు..సంస్థలకు మాత్రమే రాయితీలు..ప్రోత్సాహకాలు ఇస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

Next Story
Share it