Telugu Gateway
Cinema

‘అఖిల్’ను ఈ సారైనా అదృష్టం వరిస్తుందా?

‘అఖిల్’ను ఈ సారైనా అదృష్టం వరిస్తుందా?
X

అక్కినేని అఖిల్. నటనలో ఈజ్..డ్యాన్స్ లు పర్పెక్ట్. ఫైట్లు సూపర్బ్. కానీ ఎక్కడో ఏదో తేడా కొడుకుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సూపర్ హిట్ అనే సినిమా మాత్రం రావంట లేదు. తొలి సినిమా అఖిల్ తోనే భారీగా నిరాశపర్చాడు ప్రేక్షకులను. దీనికి ప్రధాన కారణం కథే అని చెప్పకతప్పదు. తొలి సినిమా అయినా అఖిల్ లో ఈ కుర్ర హీరో నటనలో చాలా ఈజ్ చూపించారు. రెండవ సినిమా ‘హలో’ పరిస్థితి అదే. ఓ మోస్తరు సినిమాగా నిలిచింది తప్ప..హిట్ టాక్ దక్కించుకోలేకపోయింది. ఇప్పుడు అఖిల్ ‘ మిస్టర్ మజ్ను’తో వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. మరి ఈ సినిమా అయినా ఆయన సూపర్ హిట్ కోరికను నెరవేరుస్తుందా? ఈ అక్కినేని వారసుడి సినీ కెరీర్ కు బ్రేకులు లేకుండా చేస్తుందా? వేచిచూడాల్సిందే.

తొలి ప్రేమ సినిమాతో సూపర్‌హిట్ అందుకున్న వెంకీ అట్లూరి దర్శకత్వంలో సక్సెస్‌ ఫుల్ నిర్మాత బీవీయస్‌ఎన్‌ ప్రసాద్ మిస్టర్ మజ్నును నిర్మిస్తున్నారు. ఇటీవల లండన్‌లో మేజర్‌ షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సినిమాను అక్కినేని లక్కీ మంత్‌ డిసెంబర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేశారు చిత్రయూనిట్. అయితే అదే సమయంలో వరుణ్ తేజ్‌ ‘అంతరిక్షం’, శర్వానంద్‌ ‘పడి పడి లేచే మనసు’ సినిమాలు రిలీజ్ అవుతుండటంతో మజ్నును ను వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

Next Story
Share it