Telugu Gateway
Andhra Pradesh

పాపం చంద్రబాబు...పాపం లోకేష్!

పాపం చంద్రబాబు...పాపం లోకేష్!
X

పాపం..చంద్రబాబునాయుడు. నారా లోకేష్ ను ఆయన ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటారు. కానీ ఆయన మాత్రం రారు. ఎన్ని జాకీలేసి..లేపినా..లోకేష్ మాత్రం నేను అక్కడే ఉంటాను అంటున్నారు. దీనికి చంద్రబాబు మాత్రం ఏమి చేయగలరు?. తాజాగా ఏపీలోని తిరుపతిలో డిక్సన్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం జరిగింది. అందులో మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. అక్కడ ఆయన మాట్లాడిన మాటలు చూసి అందరూ షాక్ కు గురవుతున్నారు. అదేంటో మీరూ ఓ సారి చూడండి. ‘మన ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజుకు భారత దేశంలో వంద ఫోన్లు తయారు అయితే ఆంధ్ర రాష్ట్రంలో తయారయ్యే ఫోన్లు సున్నా. అలాంటిది నాలుగు సంవత్సరాల్లోనే భారత దేశంలోనే వంద ఫోన్లు తయారవుతుంటే..ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజు 260 ఫోన్లు తయారు అవుతున్నాయి.’ ఇదీ ఏపీ భవిష్యత్ నేతగా కీర్తించబడుతున్న..కొన్ని మీడియా సంస్థలు జాకీ లేపి లేపుతున్న ఏపీ ఫ్యూచర్ లీడర్ నారా లోకేష్ అద్భుతమైన స్పీచ్.

అసలు భారత్ లోనే వంద ఫోన్లు తయారు అవుతుంటే ఏపీలో 260 ఫోన్లు తయారు అవటం ఏమిటో...ఆయన చెప్పటం ఏమిటో అంతా విచిత్రమే. ఏపీలో భారత్ లో భాగం కాదా?. చంద్రబాబు, నారా లోకేష్ లు ఏపీని ఓ ప్రత్యేక దేశంగా భావిస్తున్నారా?. ఈ లెక్క చూస్తేంట లోకేష్ ఈ మధ్య పర్యటించి వచ్చిన చైనాలో తయారయ్యే ఫోన్లను కూడా ఏపీలో కలిపేసుకున్నారా ఏంటి..కొంప దీసి?. ఇది ఒక్కటే కాదు..ఇలాంటి ఆణిముత్యాలు ఎన్నో నారా లోకేష్ స్పీచ్ లో ఉన్నాయి. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఎమ్మెల్యేగా గెలవకపోయినా...ఎమ్మెల్సీ చేసేసి ఏకంగా మంత్రి పదవి కూడా కట్టెబెట్టారు. అలాంటి..ఇలాంటివి కాదు..ఏకంగా పంచాయతీరాజ్, ఐటి శాఖలు. పేరుకు రెండు శాఖలే అయినా ప్రభుత్వంలో పెత్తనం అంతా ఆయనదే అన్న ప్రచారం టీడీపీ వర్గాల్లో ఉంది. తన కొడుకును రాజకీయ వారసుడిగా చంద్రబాబు ఇప్పటికే ప్రొజెక్ట్ చేశారు. కానీ ఆయన మాత్రం చంద్రబాబు అంచనాలను అందుకోలేక తల్లడిల్లుతున్నారు.

లోకేష్ అద్భుత స్పీచ్ వీడియో లింక్ చూడండి

https://www.youtube.com/watch?v=xei138yfmxw

Next Story
Share it