Telugu Gateway
Telangana

హరీష్ కు కెసీఆర్ ఆ టార్గెట్ పెట్టారా?!

హరీష్ కు కెసీఆర్ ఆ టార్గెట్ పెట్టారా?!
X

వచ్చే ఎన్నికల్లో గెలుపు ఒకెత్తు. మరి అందరి కంటే ఎక్కువ మెజారిటీ ఎవరికి వస్తుంది?. ఆపద్దర్మ ముఖ్యమంత్రి కెసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోనా?. లేక సాగునీటి శాఖ మంత్రి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్ధిపేటలోనా?. కెసీఆర్ తనయుడు, మంత్రి కెటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లలోనా?. ఎవరు ఎక్కువ మెజారిటీ సాధించుకుంటారు?. ఇదీ ఇప్పుడు టీఆర్ఎస్ వర్గాల్లో జరుగుతున్న ఆసక్తికరమైన చర్చ. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో ప్రస్తుతం విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఆ నియోకవర్గంలో చేయటానికి 2100 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేసినా కనీసం స్థానికులను కెసీఆర్ ఏ మాత్రం పట్టించుకున్న పాపాన పోలేదని ఆ పార్టీ నాయకులు వాపోతున్నారు. అందుకే వారంతా ప్రస్తుతం గుర్రుగా ఉన్నారు. గత కొంత కాలంగా గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ కీలక నేతలు..కాంగ్రెస్ గూటికి చేరటం. మళ్ళీ మంత్రి హరీష్ రావు రంగంలోకి దిగి వెంటనే వారికి వెనక్కి తేవటం. ఇదే సాగుతోంది అక్కడ.

అసలు ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఎందుకొచ్చింది?. అదే కెసీఆర్ ప్రత్యర్ధి ఒంటేరు ప్రతాప్ రెడ్డి స్థానిక నాయకులతోపాటు కార్యకర్తలతో సన్నిహితంగా ఉంటూ వారి అవసరాలు అన్నీ చూసుకుంటున్నారు. ఇది చూసిన టీఆర్ఎస్ స్థానిక నేతలకు మరింత ఒళ్ళు మండిపోతోంది. కనీసం పార్టీ అధినేత కెసీఆర్ తమతో మాట్లాడకపోవటం ఏంటి? అని పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఇది టీఆర్ఎస్ నేతల్లో టెన్షన్ పెంచుతోంది. అంతే కాదు..సిద్ధిపేట కంటే గజ్వేల్ లో మెజారిటీ ఎక్కువ రావాలని కెసీఆర్ తాజాగా హరీష్ రావును ఆదేశించారని పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఇది జరిగే పనికాదని..అలా కావాలంటే హరీష్ రావు స్వయంగా తన మెజారిటీని తగ్గించుకోవటం తప్ప మరో మార్గం ఉండదని పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కెసీఆర్, హరీష్ రావు, కెటీఆర్ ల మెజారిటీ వ్యవహారం కూడా అత్యంత కీలకంగా..ప్రతిష్టాతక్మకంగా మారనుంది. అసలే కెటీఆర్ ను ప్రోత్సహించేందుకు కెసీఆర్ ఫ్యామిలీ ‘హరీష్’ను టార్గెట్ చేసింది. హరీష్ మరి ఈ టాస్క్ ను ఎలా అధిగమిస్తారో వేచిచూడాల్సిందే. లాజిస్టిక్స్ విభాగంలో సేవలు అందిస్తున్న టీజీఐ కంపెనీలోనూ ఐటి సోదాలు సాగుతున్నాయి. ఈ కంపెనీ టీడీపీ సీనియర్ నేత దేవేందర్ గౌడ్ బంధువులదిగా చెబుతున్నారు.

Next Story
Share it