Telugu Gateway
Telangana

కలవని కెసీఆర్ కంటే..రాహుల్..బాబు బెటర్ కాదా?

కలవని కెసీఆర్ కంటే..రాహుల్..బాబు బెటర్ కాదా?
X

ఢిల్లీ వెళితే కాంగ్రెస్ నేతలకు రాహుల్ గాంధీ కలుస్తారు...అమరావతి వెళితే తెలుగుదేశం నేతలకు చంద్రబాబు కలుస్తారు. ..మరి హైదరాబాద్ లో ఉన్నా తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నేతలకు ఆ పార్టీ కెసీఆర్ కలుస్తారా?. గత నాలుగున్నర సంవత్సరాల కాలంలో తెలంగాణలో ఏమి జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఢిల్లీలో ఉండటమే తప్పా?. మరి పార్లమెంట్ ఢిల్లీలో ఉందని తెలంగాణ బిల్లును ఆపుకోలేదు కదా? ఇదే కాంగ్రెస్ అధిష్టానం సోనియా గాంధీని కెసీఆర్ కుటుంబంతో సహా కలసి వచ్చారు కదా? సోనియా గాంధీ వల్లే తెలంగాణ వచ్చిందని అసెంబ్లీ సాక్షిగా కెసీఆర్ చెప్పారు కదా?. ఢిల్లీలో సోనియాను కెసీఆర్ కలవగా లేని తప్పు..సొంత పార్టీ నేతలు కలిస్తే తప్పేంటి?. కెసీఆర్ లెక్కే నిజం అయితే ఆదిలాబాద్ నేతలు పార్టీ టిక్కెట్ల కోసం హైదరాబాద్ వచ్చి అధిష్టానాన్ని ఎందుకు కలవాలి?. అలా అయితే ఆదిలాబాద్ వాళ్లకు ఆత్మ గౌరవం లేనట్లా?. కెసీఆర్ నియమించిన జిల్లా అధ్యక్షులకే అసెంబ్లీ టిక్కెట్ల ఖరారు బాధ్యత అప్పగించవచ్చు కదా?. ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లా ఆత్మగౌరవం అంటే? సాధ్యమవుతుందా?.

కాంగ్రెస్ అధిష్టానంలో ఢిల్లీలో ఉండొచ్చు...టీడీపీ అధిష్టానం అమరావతిలో ఉండొచ్చు. హైదరాబాద్ లో ఉండి కూడా కెసీఆర్ సొంత పార్టీ ఎమ్మెల్యేలను కూడా కలవని సందర్భాలు ఎన్నో. కేవలం ఎంపిక చేసిన నేతలకు తప్ప..చాలా మందికి ప్రగతి భవన్ లోకి ఎంట్రీనే దక్కలేదని టీఆర్ఎస్ నేతల్లో ప్రచారం ఉంది. ఎమ్మెల్యేలే కాదు...మంత్రులదీ కూడా అదే పరిస్థితి. ఈ తీరు చూసి అసెంబ్లీ రద్దుకు ముందే ఓ సీనియర్ మంత్రి ..తనను పిలిస్తే తప్ప..మరోసారి ప్రగతి భవన్ వైపు రానని వ్యాఖ్యానించారంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. ఒక్క మంత్రులు..ఎమ్మెల్యేలే కాదు..అధికారులకూ ప్రగతి భవన్ లో అదే పరిస్థితి ఎదురైందని ఆ పార్టీ నేతలే అంతర్గత సంభాషణల్లో వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజల డబ్బుతో కట్టిన ప్రగతి భవన్ లో ఏ అంశంపై అయినా ప్రజలు సీఎం ను కలసి వినతిపత్రాలు అందజేస్తామంటే అది జరిగే పని కాదు. సామాన్యులకు ప్రగతి భవన్ తాళాలు ఏ రోజూ తెరుచుకోలేదు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేల పరిస్థితి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు?.

Next Story
Share it